ప్రధానిగా పెద్దన్న మోడీ ఉన్నారు. చిన్నన్న కేసీయార్ తెలంగాణా సీఎంగా ఉన్నారు. ఇక ఏపీలో చిన్న తమ్ముడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ముగ్గురినీ కలపి గత ఏడాది ఎన్నికల వేళ చంద్రబాబు విమర్శించేవారు. ముగ్గురు మోడీలంటూ ఘాటుగానే కామెంట్స్ చేసేవారు. అయితే ఎన్నికల ఫలితాల  తరువాత మోడీని మాటలనడం తగ్గించేశారు. ఇక ఈ మధ్య్హ కేసీయార్ జోలికి కూడా బాబు అసలు వెళ్ళలేదు. తన చిరకాల‌ ప్రత్యర్ధి, తన కుర్చీ ఎక్కేసిన జగన్ని మాత్రమే గురిపెట్టి చంద్రబాబు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

 

బాబు రాజకీయ వేదిక  ఏపీ కాబట్టి ఆయనకు జగన్ ప్రత్యర్ధిగా ఉండకతప్పదు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ తో ఉన్న మిగిలిన ఇద్దరినీ విడదీయాలి, లేదా తానైనా చెలిమి చేయాలి ఈ రకమైన రాజకీయ లెక్కల్లో బాబు ఉన్నారు. కానీ జగన్ మోడీ దోస్తీ బాగానే సాగుతోంది. అలాగే జగన్ కేసీయార్ కూడా గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇపుడు కరోనా ఎఫెక్ట్ తో కేసీయార్ సైతం మోడీతో కలసి పనిచేస్తున్నారు.

 

దేశాన్ని కరోనా బారిన పడకుండా వ్యూహాత్మకమైన చర్యలను తీసుకుంటున్న మోడీ తనతో పాటు కలసివచ్చే ముఖ్యమంత్రులను కూడా దగ్గరుండి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక మోడీ కూడా వారితో కలసి సలహా సూచనలు పంచుకుంటున్నారు. అలాగే ఇటీవల  సీఎంల వీడియో  సమావేశంలో కేసీయార్  కరోనా నివారణ కోసం మోడీకి కీలకమైన సలహా ఇచ్చారని, ఆయన సైతం ఓకే అన్నారని కూడా వార్తలు వచ్చాయి.

 

అదే టైంలో ఇపుడు తెలుగు రాష్ట్రాలకు మోడీ సలహాలు ఇస్తూ కరోనా కట్టడికి తమ వంతుగా సాయం చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగమే రెండు తెలుగు రాష్ట్రాలో లాక్ డౌన్ ఒకేసారి చేయడం అంటున్నారు. దేశంలో కలసివచ్చే రాష్ట్రాలన్నీ కలుపుకుని తొలి విడతగా లాక్ డౌన్ ప్రకటించాలని మోడీ ఆలోచించారని ఆ దిశగా కర్నాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు జత అయ్యాయని అంటున్నారు.

 

అలాగే,  ఈ నెల 31 తరువాత కరోనా నియంత్రణపై సమీక్షించి  ఎలా ముందుకు వెళ్ళాలో మోడీ ఆలోచిస్తున్నారు. ఆయనతో పాటుగానే తెలుగు రాష్ట్రాల్లో నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ జగన్, కేసీయార్ సైతం సాగుతున్నారు. మొత్తానికి   కరోనా నియంత్రణ జరగాలని అంతా కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: