ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది.. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..ఇప్పటికే చాలా కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఎలాగైనా కరోనాకు స్వస్తి చెప్పాలని భారత ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది.. 

 

 


అయితే, అత్యవసర సేవలైన వైద్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ, ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు, మీడియా సిబ్బందికి మాత్రం జనతా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఏపీలో అయితే పెట్రోలు బంకులు కూడా మూసివేశారు. ఎప్పుడు ఉరుకుల పరుగుల జీవితంల సాగుతున్న హైదరాబాద్ ప్రపంచం అనేది ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది.. ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి నుంచి బయటకు రావడం లేదు.. రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి..ఈ మేరకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు..

 


ఇటీవల కాలంలో ట్రాఫిక్‌ పది శాతం పెరిగిందని గుర్తించారు. ట్రాఫిక్‌ అనూహ్యంగా పెరగడం కారణంగా నెట్‌వర్క్‌ స్తంభించే అవకాశం లేదని, సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌.మ్యాథ్యూస్‌ వెల్లడించారు. డేటా డిమాండ్‌ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకావని, నెట్‌వర్క్స్‌ అన్నీ ఆ మేరకు సామర్థ్యంతో ఉన్నాయన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.

 

 

మరోవైపు రిలయన్స్‌ జియో వంటి టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్‌ కస్టమర్లకు వారి మొబైల్స్‌లో డేటా కెపాసిటీని డిమాండ్‌కు అనుగుణంగా పెంచుతున్నాయి. టాప్‌ అప్స్‌కు సరికొత్త టారిఫ్‌ ప్యాకేజ్‌ను జియో ఇటీవల లాంఛ్‌ చేసింది. ఇక భారతి ఎయిర్‌టెల్‌ హోం బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు వీలుగా వేగవంతమైన, అధిక డేటా ప్లాన్స్‌ను వర్తింపజేస్తోందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.ఈ మేరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త లు తీసుకున్నట్లు సమాచారం...

మరింత సమాచారం తెలుసుకోండి: