కరోనా వైరస్ ను అరికట్టేందుకు   కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటున్నాయి . ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రజలు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ లో పాల్గొని , కరోనా మహమ్మారి వ్యతిరేకత పోరాటానికి  తమ సంఘీభావాన్ని ప్రకటించారు . అదే సమయం లో కరోనా కు వ్యతిరేకంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి పారిశ్రామిక వేత్తలు కూడా  ముందుకొచ్చి తమ వంతుగా  భూరి విరాళాన్ని అందచేస్తూ , తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు .

 

వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గర్వాల్ తనవంతుగా వంద కోట్ల విరాళాన్ని ప్రకటించారు . కరోనా కారణంగా దేశం లోని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే . ఈ నేపధ్యం లో దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు . అనిల్ తరహాలోనే ఇప్పటికే ఎఫ్ ఎం సీజీ కంపెనీ,  హిందుస్థాన్ యూనీలీవర్ కరోనా కు వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వందకోట్ల విరాళాన్ని ప్రకటించింది . తమ ఉత్పత్తులను కూడా ధరలను తగ్గించి ఇస్తామని పేర్కొన్న సంస్థ ఎండీ సంజీవ్ మెహతా , రానున్న నెల రోజుల వ్యవధిలో రెండు కోట్ల  లైఫ్ బాయ్ సబ్బులను దేశవ్యాప్తంగా  ఉచితంగా  పంపిణి చేయనున్నట్లు వెల్లడించారు . 

 

పతంజలి , గోద్రెజ్ వంటి సబ్బుల తయారీ కంపెనీలు తమ ఉత్తత్తుల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాయి . కరోనా ను శానిటైజేషన్ , స్వీయ నియంత్రణ  ద్వారానే అరికట్టే  అవకాశాలుండడంతో సబ్బుల తయారీ కంపెనీలు విధిగా తమ వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నాయి .  

మరింత సమాచారం తెలుసుకోండి: