కేసీఆర్ ప్రెస్ మీట్ అంటేనే విలేకరులు చాలా ఇంట్రస్టింగా ఉంటారు.ఏదైనా ఆసక్తికరంగా చెప్పడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా.. ఈ విషయం ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. అయితే ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో చెప్పలేం. అది ఆయన మూడ్ ను బట్టి ఉంటుంది.. ఒక్కోసారి జోకులేస్తే.. ఒక్కోసారి కసురుకుంటారు..

 

 

అలాంటి సీనే తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ లో జరిగింది. సంక్షోభ సమయంలో మీడియా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ విలేకరికి క్లాస్ పీకారు. ఒక రిపోర్టర్ వేసిన ప్రశ్న ఆయనకు బాగా కోపం తెప్పించింది. ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ఇది సమయమా అంటూ మండిపడ్డారు. ఐ యామ్ సారీ.. ఇలాంటి చిల్లర ప్రశ్నలు వేయకండి అంటూ బాగానే క్లాస్ పీకారు కేసీఆర్.

 

 

ఇలాంటి సంక్షోభ సమయాలను మీడియా కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. రాజకీయాలకు ఇది సమయం కాదని కేసీఆర్ అన్నారు. వస్తువుల ధరలపై మరో విలేకరి ప్రశ్నించిన సమయంలోనూ ఆయన అలాగే చిరాకు పడ్డారు. కరోనా సాకుతో వ్యాపారస్తులు ధరలు పెంచకూడదని.. అలా ఎవరైనా పెంచితే ఫిర్యాదు చేసే బాధ్యత పౌరులుగా మీడియా వాళ్లకూ ఉంటుందన్నారు.

 

 

కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్న కేసీఆర్.. ఈ విషయంలో మీడియా కూడా పాజటివ్ గా స్పందించాలని కోరారు. నెగిటివ్ ధోరణితో అన్ని వేళలా వ్యవహరించడం మంచిది కాదన్నారు. అదే సమయంలో లాక్ డౌన్ సమయంలోనూ మీడియా వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందన్న కేసీఆర్ మీరు కూడా గుంపులు గుంపులుగా పోకూడదని మీడియాపై సెటైర్లు వేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: