కరోనా సమయంలో దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో కేంద్రం లాక్ డౌన్ చేసింది. అంటే ఎక్కడివక్కడే ఆగిపోతాయి. రవాణా ఉండదు. నిత్యవాసరాలు, అత్యవసర సర్వీసులు తప్ప అంతా క్లోజ్ అవుతాయి. మరి అలాంటి సమయంలో పేదల పరిస్థితి ఏంటి.. ఇందుకు సమాధానంగా అనేక దేశాలు లాక్ డౌన్ సమయంలో పేదలను ఆదుకుంటున్నాయి. పరిహారంగా కొంత సొమ్ము, సహాయం అందిస్తున్నాయి.

 

 

అనేక దేశాలకు ప్రజలకు డబ్బు ఇవ్వడానికి ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. అమెరికాలో ఒక్కో కుటుంబానికి 1200డాలర్లు ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మరి కొన్ని ఇతర దేశాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కానీ భారత ప్రభుత్వం ఇంకా అలాంటి ప్రకటన ఏదీ చేయనేలేదు. కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ పిలుపు ఇచ్చి దేశంలో స్ఫూర్తి నింపిన మోడీ.. పేదలను ఆదుకునేందుకు మాత్రం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు.

 

 

దీంతో.. ఇప్పుడు ఆ బాధ్యత రాష్ట్రాల పైనే పడుతోంది. దీనివల్ల రాష్ట్రాలపై ఎక్కువ భారం పడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. కేరళ సి.ఎమ్. ఏకంగా 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆర్థిక సాయం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేషన్ తో పాటు కుటుంబానికి 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

 

 

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ నెల రోజుల రేషన్, కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. రేషన్ కార్డుదారుకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రం కాస్త ఉదారంగా సాయం చేయాలని నిపుణులు చెబుతున్నారు. సరైన సాయం ప్రకటించకపోతే.. లాక్ డౌన్ పేదల పాలిట శాపంగా మారుతుందని సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: