నిన్న మొన్నటి వరకూ కరోనా గురించి కేసీఆర్, జగన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పారిసిట్మాల్ వాడితే చాలు.. బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే చాలు అన్న మాటలపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే.. కేరళలో అలాంటి ప్రయోగమో విజయవంతం అయ్యిందట. ఇప్పుడు ఈ వార్త ఆసక్తి రేపుతోంది.

 

 

కేరళలో పారాసిట్మల్ మందును ప్రయోగించడం ద్వారా కరోనా వైరస్ కు కొంత విరుగుడు కనిపెట్టారన్న వార్త ఇంట్రస్టింగా ఉంది. కరోనాకు ఇప్పటి వరకూ మందులేకపోవడంతో చాలా మంది వైద్యులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని ఫలిస్తున్నాయి. అలాంటిదే ఈ కేరళ వైద్యుల ప్రయోగం కూడా. తొలుత వైరస్‌ బారిన పడిన వారు తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారట.

 

 

కేరళలో అలాంటి వారందరికీ దగ్గు మందుతో కలిపి పారాసిట్‌మాల్‌ వాడారట. ఈ మందుతో చాలా వరకూ ఫలితం కనిపించిందట. రోగులు కరోనా కాటు నుంచి బయటపడ్డారట. వరుసగా నాలుగు రోజుల పాటు ఇవే మందులను వాడామని, వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిందని కేరళ వైద్యులు చెబుతున్నారు. కేరళలో కరోనా బాధితుల సంఖ్య 40 చేరిందట.. ఇప్పుడు వారిందరికీ కూడా పారాసిట్‌మాల్‌ వాడుతున్నామని కేరళ వైద్యులు చెప్పారు.

 

 

కేరళ డాక్టర్ లు వాడిన మందును ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు కూడా వాడుతున్నారని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోనూ వైద్యులు సొంత ప్రయోగాలతోనే కరోనాను కట్టడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రయోగాలే.. ప్రపంచంలోనే ఇప్పటి వరకు కరోనాకు సరైన వాక్సిన్‌ కనిపెట్టలేదు. అప్పటి వరకూ ఇలాంటి ప్రయోగాలు తప్పదేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: