తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 20 మందికి పైగా ఈ కరోనా వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక కంటికి కనిపించని శత్రువు ఎటునుంచి దాడి చేస్తుందోనని ప్రజలందరూ ప్రాణభయంతో నే బతుకుతున్నారు. ఇక రోజు రోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం... అటు అనుమానితుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుండడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జన సమూహం ఉన్న అన్ని ప్రదేశాలను మూసి వేస్తూ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చిన తెలంగాణ సర్కార్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ను  తరిమికొట్టేందుకు ప్రజలు అందరూ సహకరించాలని కేసీఆర్ కోరారు. 

 

 

 అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి స్పందిస్తూ కేసీఆర్ సర్కార్ పై పలు విమర్శలు గుప్పించారు. కరోనా  వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాన్ని సమర్థిస్తూనే కేసిఆర్ పై విమర్శలు చేశారు విజయశాంతి. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తెలంగాణ సమాజం ఈ రోజు ఇంత ఆందోళన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది అంటూ విమర్శించారు. ప్రభుత్వ క్వారంటైన్ లో ఉన్న  వందలాది కరుణ బాధితులను.. హోమ్ క్వారంటైన్  కు తరలించడం వల్ల సమస్య ఇంతవరకు వచ్చింది అంటూ కొందరు వైద్యనిపుణులు చెబుతున్నారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు విజయశాంతి. 

 

 

 నేడు తెలంగాణ ప్రజానీకం మొత్తం అంతగా భయాందోళనకు గురి కావడానికి కారణం కూడా అదే అంటూ వైద్యులు అంటున్నారని విజయశాంతి ఆరోపించారు. ఇక దీనికి తోడు తెలంగాణ రాష్ట్రానికి గత కొన్ని నెలల నుంచి విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎటువంటి పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వారిని వదిలేసిందని... విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితి వచ్చింది అంటూ మండిపడ్డారు. ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదు అన్న విజయశాంతి... వైరస్ తీవ్రతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక చర్యలను అభినందిస్తున్న ట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అందరు సహకరించాలని కోరారు విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: