అది కూడా ఓఉద్యోగమేనా.. మూటలు మోసే ఉద్యోగం.. ఏపీలో గ్రామ వాలంటీర్లపై చంద్రబాబు చేసిన కామెంట్లు ఇవి.. ఇప్పుడు ఆ మూటలు మోసే ఉద్యోగస్తులే కరోనాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఏపీ సర్కారు చెబుతోంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లను గుర్తించడంలో ఈ వాలంటీర్లు చాలా కీలక పాత్ర పోషించారని సాక్షాత్తూ జగనే ప్రశంసించారు.

 

ఆయన ఏమన్నారంటే..” దాదాపుగా రెండు లక్షల యాభై వేలకు పైగా ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయడం, వాళ్లకు ఉన్న యాప్‌ ద్వారా ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే డేటాను నమోదు చేసి వివరాలు అందజేయడం, గ్రామ సెక్రటరీయట్‌లో ఉన్న సిబ్బంది యాక్టివ్‌గా ఉంటూ అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్రంలో 11,670 మంది విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడమే కాకుండా వారికి అవగాహన కల్పించామని మెచ్చుకున్నారు జగన్.

 

 

గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం మొత్తం సురక్షిత స్థానంలో నిల్చోని ఉండటానికి తోడ్పడిన ప్రతి గ్రామ వాలంటీర్‌కు, మెడికల్‌ అసిస్టెంట్‌, ఆశా వర్కర్లు, డాక్టర్లు, సిబ్బంది, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌, కలెక్టర్లు, అధికారులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాన్నారు జగన్. దేవుడి దయతో మిగిలిన రాష్ట్రల కంటే మన రాష్ట్రం చాలా మెరుగ్గా ఉందని గర్వంగా చెప్పవచ్చన్నారు. దేశం మొత్తం మీద 4035 కేసులు నమోదు అయితే..ఐదు మంది చనిపోయారు. మన రాష్ట్రంలో కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. వీటిలో ఒక కేసు నయం అయ్యింది. డిచార్జ్‌ కూడా చేశారని జగన్ ప్రకటించారు.

 

 

అయితే.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని.. . ప్రతి నియోజకవర్గంలోనూ ఒక వంద పడకల ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించామని జగన్ తెలిపారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్‌లో 200 పడకల ఐసోలేషన్‌ వార్డుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఎవరికి కూడా గొంతు నొప్పి, జర్వం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే మొట్ట మొదటిగా విదేశాల నుంచి వచ్చిన వారితో ఎదైనా సంబంధం ఉందా అన్నది సమీక్షించుకోవాలని సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: