రాష్ట్రాల్లో సినిమా ముచ్చట్లు లేవు, షికార్లు లేవు.. రాజకీయ డిబెట్లు లేవు ఇప్పుడున్నదంతా ఒకటే కరోనా.. పొద్దున లేచింది మొదలు ఈ కరోనా కోసం ఎంతగా ఆలోచించిన తక్కువే.. అంతలా ప్రజలను భయభ్రాంతులను చేస్తుంది.. వారు వీరు అనే తేడా లేకుండా అందరి దగ్గరికి చేరుతూ రోగులుగా మారుస్తుంది.. ఇకపోతే తాజా పరిస్దితిని చూసుకుంటే  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో 27కు పెరిగింది.. ఆదివారం ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు.

 

 

ఇక తాజాగా నమోదైన కేసులన్నింటిలోనూ బాధితులందరూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇప్పుడు ప్రపంచం అంతా సంక్లిష్ట పరిస్దితుల్లో జీవిస్తుంది.. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే డీఎస్పీ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా, బాధితున్ని హైదరాబాద్‌లోని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

 

కాగా కొత్తగూడెంకు చెందిన 23 ఏళ్ల యువకుడు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే ఇతను మార్చి 18న లండన్ నుంచి హైదరాబాద్ వచ్చి, కొత్తగూడెంకు కారులో వెళ్లినట్లు తెలుస్తోంది.. అతను తన ఇంటికి చేరుకున్న తర్వాత తన కుటుంబసభ్యులతో పాటు కొంత మంది బంధువులు, మిత్రులను కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి 20న దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనాగా అనుమానించి ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించగా ఇక్కడి వైద్యులు అతడి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.

 

 

తాజాగా నిన్న ఆదివారం అతడికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది...  ఇకపోతే ఈ కరోనా ఎప్పుడు ఎవరిని కబళిస్తుందో చెప్పలేని పరిస్దితుల్లో ప్రజలు జీవిస్తున్నారు.. కాబట్టి వీలైనంతగా స్వీయరక్షణ చర్యలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: