ఏపీ సీఎం జగన్ విషయంలో బీజేపీ వైకిరి స్పష్టంగా అర్ధం కావడంలేదు. ఏపీ బీజేపీ నేతలు జగన్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుండగా, కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం జగన్ ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది పడకుండా వ్యవహరిస్తోంది. జగన్ కు అన్ని విధాలా మద్దతు పలుకుతూ, ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తోంది. తాజాగా ఏపీ శాసనమండలి విషయంలో కూడా కేంద్రం ఇదే వైకిరితో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ శాసనమండలి రద్దు చేసేకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్యెల్సీలను మీ దారిలోకి తెచ్చుకోవాలంటూ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఎలాగూ మరో రెండు సంవచ్ఛరాల్లో ఎలాగూ శాసనమండలిలో వైసీపీ బలం పెరుగుతుంది కాబట్టి అనవసరంగా రద్దు చేసుకునే కంటే టీడీపీ ఎంఎల్సీలను మీ దారిలోకి తెచ్చుకుంటే బెటర్ కదా అన్నట్టుగా సూచించినట్టు తెలుస్తోంది. 

IHG


ఏపీ శాసనమండలిలో ప్రస్తుతం 58 మంది సభ్యులు ఉండగా వారిలో 26 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే. ఆ 26 మందిలో ఇప్పటికే ముగ్గురు సభ్యులు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. శాసన మండలి రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ లో తీర్మానం చేసిన తరువాత మరో ఇద్దరు వైసీపీలోకి వచ్చి చేరారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చి చేరారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజక వర్గ స్థాయి నాయకులూ పెద్ద ఎత్తున వచ్చి వైసీపీ లో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీద ఆ పార్టీ నాయకులందరికీ బెంగ ఉంది. చంద్రబాబు పార్టీ మీద పట్టు కోల్పోవడంతో భవిష్యత్తు అంధకారమే అన్నట్టుగా వీరంతా ఒక ఆలోచనకు వచ్చేసారు. 

IHG


ఇటువంటి సమయంలో శాసనమండలి రద్దు చేసుకునే కంటే టీడీపీ ఎంఎల్సీల్లో మూడొంతుల మందిని వైసీపీలో చేర్చుకుని వైసీపీ బలం పెంచుకోవాలని సూచించడంతో ఇప్పుడు జగన్ ఆపరేషన్ ఆకర్ష్ కి తెర తీసినట్టు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే మీకు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తూ ఎంఎల్సీలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అసలు శాసనమండలి రద్దు అవుతుంది అన్న ఆలోచనతోనే జగన్ ఎంఎల్సీ లుగా, మంత్రులుగా ఉన్న ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్ లకు రాజ్యసభ స్థానాలు కట్టబెట్టారు. ఇప్పుడు కేంద్రం సూచనలతో శాసనమండలి రద్దు అవ్వదనే క్లారిటీ కి జగన్ వచ్చేసాగారు. ఈ విషయం టీడీపీ కి కూడా సమాచారం ఉండడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆనందం కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: