ఇప్పటివరకు మనిషి చేసిన అభివృద్దిని, చూస్తుంటే నిజంగా మనుషులంత ఎంత మేధావులో అని ఒప్పుకోకతప్పదు.. కానీ ఆ మెప్పును ప్రశ్నిస్తూ అప్పుడప్పుడు ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తూ విపత్తులను సృష్టిస్తుంది. ఎంత ఎదిగిన పకృతి ముందు మానవుడు ఎప్పుడు ఓటమినే పొందుతున్నాడు.. అయినా జాగ్రత్తపడుతు తన మేధాశక్తితో రోజు రోజుకు తన జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ బ్రతకడం నేర్చుకుంటున్నాడు..

 

 

ఎంత ఎదిగిన ప్రపంచాన్ని వణికించడానికి అప్పుడప్పుడు కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.. ఇలా పుట్టుకొచ్చిందే కరోనా.. దీని దాటికి ఇప్పటికే ప్రపంచదేశాలన్ని ఆందోళన చెందుతూ, అల్లకల్లోలం అవుతున్నాయి.. రోజు రోజుకు ఈ వైరస్ విస్తరిస్తూ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుంది.. ఇకపోతే ఈ కరోనా వైరస్ తీవ్రతను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వైరస్ తీవ్రంగా ఉన్న 80 జిల్లాల్లో కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది.. ఇందులో భాగంగా వచ్చే రెండు రోజుల్లో మరిన్న కఠిన నిర్ణయాలను తీసుకోనుందని తెలుస్తుంది.. ఇక వైరస్ నియంత్రణలో భాగంగా ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి ఊహించనంత స్పందన లభించడంతో అదే ఉత్సాహంతో ప్రభుత్వం ఈ మహమ్మారి కోరలు పీకడానికి సంసిద్ధమైంది.

 

 

కాగా, ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 396కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లోనే 80కిపైగా కేసులు నమోదయ్యాయంటే ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోండి.. ఇదిలా ఉండగా 250కిపైగా కేసులు గత నాలుగు రోజుల్లోనే నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా అత్యధికంగా మహారాష్ట్రలో 74 కేసులు నమోదయ్యాయి. కేరళలోనూ ఆదివారం మరో నలుగురికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 52కి చేరింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19తో ఇప్పటి వరకూ ఏడుగురు చనిపోయారు..

 

 

ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఐదుగురు మృతిచెందారు. ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లో ఒక్కొక్కరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 74, కేరళలో 54, ఢిల్లీలో 30, ఉత్తరప్రదేశ్‌లో 27, కర్ణాటకలో 26,లడఖ్ 14, తెలంగాణ 27, రాజస్థాన్ 28, గుజరాత్ 19, ఆంధ్రప్రదేశ్ 6, మధ్యప్రదేశ్ 6, మిగతా రాష్ట్రాల్లో రెండు, ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. మొత్తం 396 కేసుల్లో 39 మందికిపైగా విదేశీయులు ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటి వరకు 20 మంది బాధితులు కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: