ప్రపంచం మొత్తం కరోనా ఎఫెక్ట్ తో అతలాకుతలం అవుతుంటే వారు మాత్రం తాపీగా పెళ్లి కోసం రెడీ అయ్యారు.  అయివే వివాహ బంధంతో ఒక్కటవ్వడానికి మంచి ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకోవడం భారతీయ సాంప్రదాయం.. మళ్లీ ఆ ముహూర్తం దాటితే ఎప్పుడు జరుగుతుందో అన్న ఆందోళన ఉంటుంది.  ఈ నేపథ్యంలోనే పెళ్లి కోసం అమెరికా నుంచి పిఠాపురం వచ్చారు వధూవరులు.  కానీ దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర రూపం దాల్చడంతో ఇప్పుడు వీరి వివాహం గందరగోళంలో పడింది. ఈ వివాహానికి లండన్, మస్కట్ నుంచి కొంత మంది రావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

అంతే కాదు.. బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆందోళన చెందిన స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పెళ్లి వాయిదా పడింది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నిన్నంతా జనాలు ఇంటికే పరిమితం కాగా పెళ్లి పేరుతో పెద్ద ఎత్తున జనం రోడ్డుపైకి రావడంతో స్థానికులు ఆందోళన చెందారు.  వధూవరుడు ఇద్దరు టెక్కీలు..  అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు.  వీరిద్దరి వివాహం పిఠాపురంలో జరగాల్సి ఉంది.  వివాహానికి హాజరయ్యేందుకు ఇరువురి తరపున స్నేహితులు లండన్, మస్కట్ తదితర ప్రాంతాల నుంచి పిఠాపురం చేరుకున్నారు.  అయితే విదేశాల నుంచి వచ్చిన వారు ఉండటం, బంధువులు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతో ఆందోళన చెందిన స్థానికులు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

 

కలెక్టర్ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది వధువును స్వీయ నిర్బంధంలో ఉంచారు. వరుడు అప్పటికింకా అక్కడికి చేరుకోలేదు.  లండన్, మస్కట్ నుంచి వచ్చిన వారితోపాటు పెళ్లి కోసం వచ్చిన వారి బంధువులకు కూడా పరీక్షలు నిర్వహించారు. కాకపోతే అమెరికా నుంచి వధువుకి కరోనా లక్షణాలు ఏమీ లేకున్నా ఆమెను స్వియ నిర్భందంలో ఉంచారు.  మొత్తానికి ఈ పెళ్లి వాయిదా పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: