దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో లాక్  డౌన్  విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  విధిస్తూ ప్రజలను కేవలం ఇళ్లకే పరిమితం కావాలని అందరు సహకరించాలని కోరుతున్నారు . ఇక కొన్ని కొన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ప్రకటిస్తూన్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైరస్ ను  అరికట్టేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. యదేచ్ఛగా రోడ్డుపైన తిరగేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలోని పలు ప్రాంతాలలో లాక్ డౌన్  పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. 

 

 

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్  పై నిర్లక్ష్యం వద్దు అని... లాక్ డౌన్  ఎందుకు విధించారో  ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అంటూ సూచించారు. పలు ప్రాంతాలలో విధించిన లాక్ డౌన్ ను  ప్రజలందరూ తీవ్రంగా పరిగణించి అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. కేవలం దేశ ప్రజల ఆరోగ్యం భద్రత కోసమే లాక్ డౌన్ అంటూ  సోషల్ మీడియా వేదికగా తెలిపారు నరేంద్ర మోడీ. కరోనా  వైరస్ ను నివారించేందుకు... ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి సామాజిక దూరాన్ని పాటించాలి అని కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం పలు ప్రాంతాలలో విధించిన లాక్ డౌన్ నియమాలను రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలని... లాక్ డౌన్ పై నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో పెను ముప్పు తప్పదు అంటూ గుర్తించాలి అంటూ సూచించారు. 

 

 

 కేవలం దేశ ప్రజల ప్రయోజనం కోసమే లాక్ డౌన్ విధిస్తామని... దీనిని ప్రజలు అర్థం చేసుకొని నిబంధనలను పాటించాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇటలీ స్పెయిన్ దేశాల లాంటి పరిస్థితి భారతదేశానికి రాకుండా ఉండాలి అంటే.... ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న నిబంధనలు ప్రజలందరూ కచ్చితంగా పాటించాలని సామాజిక దూరం పాటించాలి అని  సూచించారు. దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు లాక్ డౌన్  పాటించకుండా బయట తిరగడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: