మన మెదడులోని ఒక రసాయనం నమ్మకం. ఆరసాయనాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే ఆనమ్మకం సంజీవినిగా మారి ఆలోచనలను కలిగించి మన విజయానికి మార్గంగా మారుతుంది. అనాది కాలం నుండి మతవాదులు మన నమ్మకానికి విశ్వాసం అన్నపదం పెట్టి ఆధ్యాత్మిక రంగు వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.


ఈ నమ్మకాలలో భాగంగానే నష్ట జాతకులు అదృష్ట జాతకులు అన్న నమ్మకాలు పుట్టుకు వస్తాయి. అనేకమంది తాము జీవితాంతం పేదరికానికి అంకితం అయిపోవడంతో నష్ట జాతకులు అన్న జాబితాలోకి చేరిపోతు ఉంటారు. అయితే వారి దురదృష్టానికి వారు ఏర్పరుచుకున్న విశ్వాసమే కారణం. మన మనసు నిరంతరం సానుకూల ఆలోచనలతో ఉంటే జీవితంలో ఎవరు నష్ట జాతకులుగా మిగిలిపోరు. అందరు అదృష్ట వంతులుగానే కొనసాగుతారు.


అందుకే సర్వసంపదలకు మూలం నమ్మకం అని అంటారు. అయితే వైఫల్యానికి విరుగుడు కూడ నమ్మకమే. అందుకే ఒక వ్యక్తి ధనవంతుడుగా మారాలి అంటే ఇంద్రజాలీకుడు మేజిక్ పై ఎంత పట్టు ఉంటుందో డబ్బు సంపాదించే వ్యక్తికి కూడ తాను అనుకున్న విషయాలను ఎదుటి మనిషికి చెప్పి ఒప్పించడంలో ఒక మెజీషియన్ కు ఉన్నంత సమర్థత ఉండాలి అంటు ప్రముఖ మనీ శాత్రవేత్త నెపోలియన్ హిల్ అభిప్రాయాలను వెల్లడించాడు.

 

వాస్తవానికి మన మనసు ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటుందో అలాంటి ప్రకంపనలే మన హృదయం ప్రతిస్పందిస్తుంది. దీనితో అప్పటికే మనం డబ్బు సంపాదించాలి అంటూ వేసుకున్న ప్రణాళికలు మన మనసులో వచ్చే నెగిటివ్ ఆలోచనలతో మన ధన సంపాదనకు సంబంధించిన ఆలోచనలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి. దీనితో మనం ఆ నెగిటివ్ ఆలోచనల నుండి బయటకు రావాలి అనుకుంటే ‘నేను ధనవంతుడుని అవ్వాలి’ అంటూ కనీసం 100 సార్లు పేపరు పై వ్రాసుకున్నప్పుడు మాత్రమే మన మనసులోని నెగిటివ్ ఆలోచనలు తొలిగిపోతాయి. దీనితో మనకు మనమే ఉపదేశకులుగా మారి స్వీయోపదేశ ఇంద్ర జాలంలో నిష్ణాతులు అయినప్పుడు మాత్రమే మనం మన కలలను నెరవేర్చుకుని ఐశ్వర్య వంతులుగా మారుతాము.. 

మరింత సమాచారం తెలుసుకోండి: