ఇటలీ, అమెరికా దేశాలతో పాటు అనేక దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం మన దేశంపై కూడా బాగానే ఉందని స్పష్టమవుతుంది. కారణం వైరస్ వ్యాప్తి రెండవ దశ లో ఉన్నప్పుడు... భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్రమత్తమై వెంటనే ఎవర్ని బయటికి రావద్దని జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు. అయితే ఇది కరోనా వ్యాప్తి పై యుద్ధం చేసే ముందు కేవలం ఒక ఆరంభం మాత్రమేనని నరేంద్ర మోడీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముందు ముందు రోజుల్లో జనతా కర్ఫ్యూ కంటే ఇంకా అనేక సమర్థవంతమైన చర్యలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలుస్తుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అయ్యే సరికి తెలంగాణ సీఎం కేసీఆర్ మొట్టమొదటిగా ఈ నెల ఆఖరి వరకు లాక్ డౌన్ చేస్తున్నామని ప్రకటించారు.




మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా తప్పనిసరి పరిస్థితులలో తాము కూడా కర్ఫ్యూ ని పాటించక తప్పడం లేదని తెలియజేస్తూ ఈ నెల ఆఖరి వరకు బంద్ అని ప్రకటించేశారు. అయితే ఈ కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసరమైన సేవలు మాత్రమే కొనసాగనున్నాయి. రోడ్ల మీద కూడా ప్రజా రవాణా, ఇంకా ఇతర వాహనాల ప్రయాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇతర రాష్ట్రాల బోర్డర్స్ ని బ్లాక్ చేయమని కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు ఆదేశాలని జారీ చేసాయి. అలాగే అంతర్గతంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల చెక్ పోస్ట్ లు ఏర్పాటు అయ్యాయి.




ఈ నేపథ్యంలోనే కంచికచర్ల దొనబండ మండలం చెక్ పోస్ట్ వద్ద పోలీసులకు వాహన దారుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. విజయవాడ నగరం నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోని... తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన చెక్ పోస్ట్ లు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. అయితే వాహనదారులు మాత్రం మేము వెళ్లి తీరాల్సిందే అంటూ పట్టుబట్టడంతో... అక్కడి పరిస్థితి సద్దుమణిగేందుకు పోలీసులు కొన్ని వాహనాలకు దారిని విడిచారు. అయితే ఈ సందర్భంలోనే మూడు కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలు నిలిచిపోతే వినియోగదారులకు తీవ్ర అవస్థలు తప్పవు. అందుకే నిత్యావసర సరుకుల తీసుకెళ్లే కొన్ని వాహనాలకు పోలీసులు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. కొన్ని గంటల పాటు వాహనాల నిలుపుదల వలన ఇప్పటికే ఎన్నో కిరాణా షాపులు ఇబ్బందులు పడుతున్నాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: