తెలంగాణాలో మరో కరోనా కేసు నమోదు అయింది. కరీంనగర్ లో ఇండోనేషియా బృందం తో తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతను తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే అధికారులు గుర్తించారు. మత ప్రచారం కోసం ఢిల్లీ లో దిగి ఒక రైలు లో ఇండోనేషియా బృందం కరీంనగర్ కి వచ్చింది. అక్కడ వాళ్ళు చాలా మందిని కలిసారు. వారిలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని పరిక్షల అనంతరం తెలియడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. 

 

ఆ బృందం పర్యటించిన ప్రాంతంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు కోరారు. కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇంకా ఎవరికి సోకే అవకాశం లేదని చెప్తున్నారు. బాదితుడ్ని తాము హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించామని జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేసారు. అలాగే... ఆ బృందం తో తిరిగిన వాళ్ళు అందరూ కూడా వచ్చి వైద్య పరిక్షలు చేయించుకోవడం మంచిది అని కోరుతున్నారు. ఆ బృందంలో ఇప్పటికే ఏడుగురు వరకు కరోనా పాజిటివ్ గా నమోదు అయ్యారు. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు. 

 

ప్రస్తుతం అతనితో తిరిగిన వాళ్ళను కూడా గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ప్రస్తుతం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. ఇక కరోనా కేసులు తెలంగాణాలో 28 కి చేరుకున్నాయి. వారి అందరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ దృష్ట్యా... లాక్ డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. మరో దశకు కరోనా చేరితే మాత్రం అదుపు చేయడం దాదాపు గా కష్టమని అంటున్నారు. అందుకే ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: