క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో ప్ర‌పంచం అంతా అత‌లా కుత‌లం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ప్ర‌పంచం ఆగిపోతోంది. ఇప్ప‌టికే క‌రోనా బాధితుల సంఖ్య ప్ర‌పంచ వ్యాప్తంగా 2.60 ల‌క్ష‌లు క్రాస్ అయ్యింది. మ‌ర‌ణాలు సైతం 13 వేల‌కు చేరువ అవుతున్నాయి. మ‌న దేశంలో కూడా క‌రోనా బాధితుల సంఖ్య 300కు చేరువ అవుతుండ‌గా... అటు 7 గురు ఇప్ప‌టికే క‌రోనా సోకి మృతి చెందారు. ఇక క‌రోనా ప్ర‌భావం సినిమా ఇండ‌స్ట్రీపై సైతం ప‌డింది. ఎందుకంటే మాల్స్‌, మ‌ల్టీఫ్లెక్స్‌లు , థియేట‌ర్ల‌లో జ‌నాలు ఎక్కువ మంది వ‌స్తారు. దీంతో ఈ వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకుతుంద‌న్న టెన్ష‌న్‌తోనే వీటిని ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని చోట్లా మూసేశారు.



ఇక మ‌న‌దేశంలో ఇప్ప‌టికే దేశం అంత‌టా కూడా థియేట‌ర్ల‌ను మూసేశారు. ఏపీ, తెలంగాణ‌లో సైతం ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో పాటు థియేట‌ర్ల‌ను, మాల్స్‌ను అన్నింటిని మ‌సేశారు. ఇక థియేట‌ర్లు మూసి వేయ‌డంతో పాటు ఇటు అన్ని సినిమాల షూటింగ్‌లు వాయిదా ప‌డ‌డ‌డంతో అటు హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌, కోలీవుడ్‌.. టాలీవుడ్‌కు భారీ న‌ష్టం జ‌ర‌గ‌నుంది. ఇక హ‌లీవుడ్‌లో ఇప్ప‌టికే ప‌లు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. దీంతో అక్క‌డ భారీ న‌ష్టం వాటిల్ల‌నుంది.



హాలీవుడ్‌లో జేమ్స్‌బాండ్‌, ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ సినిమాలు వాయిదా ప‌డ్డాయి. ఇక అన్ని భాష‌ల్లో రిలీజ్‌కు రెడీ అయిన సినిమాలు ఏకంగా ఏప్రిల్‌కు వెళ్లిపోయాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే చివ‌ర‌కు ఏప్రిల్లో అయినా ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా ? అన్న సందేహాలు సైతం ఉన్నాయి. ఇక ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే అస‌లు ఇండ‌స్ట్రీలు ఇప్ప‌ట్లో కోలుకుంటాయా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక హాలీవుడ్లో ఇప్ప‌టికే రు. 4 వేల కోట్లు న‌ష్టం వాటిల్లిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు. అదే బాలీవుడ్‌లో ఈ న‌ష్టం రు. 400 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నాలు క‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: