కరోనా వైరస్ దెబ్బకి మరోసారి స్టాక్ మార్కెట్ బెంబేలు ఎత్తింది, దెబ్బకి పేకమేడలా కూలిపోయింది. స్టాక్ మర్కెట్స్ ప్రారంభంలోనే భారీగా నష్టాలతో పడింది. దేశంలో లాక్‌ డౌన్ పరిస్థితుల దృష్ట్యా దీనికి ప్రధాన కారణం. నిజానికి బెంచ్‌మార్క్ సూచీలు వరం మొదటి రోజునే ఏకంగా 10% పడిపోయాయి. ఇండెక్స్‌ లు లోయర్ సర్క్యూట్‌ కింద ట్రేడ్ అవుతున్నాయి. దీనితో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ ను మళ్ళి 45 నిమిషాల పాటు ఆపేసారు. BSE సెన్సెక్స్ ఏకంగా మూడు వేల పైన పాయింట్లు కూప్పకూలింది. దీనితో 27 వేల  పాయింట్ల కింది ట్రేడ్కు అవుతుంది. 

 

IHG


అయితే సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఇండెక్స్ ఈ స్థాయిలోనే నష్టాలపాలైంది. ఇక NSE నిఫ్టీ కూడా ఏకంగా దెగ్గరదెగ్గర 1000 పాయింట్లు పడిపోయింది. దీనితో 7800 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ఇది అది అని తేడాలేకుండా అన్ని రంగాల్లోనూ అమ్మకాల సునామీ చూడాల్సి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కూడా ఏకంగా 10 శాతం పైనే నష్టపోయింది.

 

IHG

 

ఇందులో ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్లు అతి భారీగా నష్టపోయాయి. ఇవి 10% - 13% మధ్యలో కుప్పకూలాయి. అయితే ఇంకో వైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి దారుణంగా పడిపోయింది. తొలిసారిగా రూపాయి 76 మార్క్ కిందకు చేరుకుంది. డాలర్‌ తో పోలిస్తే రూపాయి ఈరోజు మొదట్లోనే 76.15 స్థాయికి చేరింది. ఈ దెబ్బతో అమెరికా డాలర్ మరింత బాల పడింది. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: