క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు చాలా మంది ప్ర‌జ‌లు హోమియా మందుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వీటిని వాడేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన వైసీపీకి చెందిన కొంత‌మంది నాయ‌కులు రాజ‌కీయ ప్ర‌చారానికి వాడుకోవ‌డం విశేషం. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా మంది నివారణ చర్యల్లో భాగంగా హోమియో మందులను పంపిణీ చేస్తున్నారు వైసిపి నాయకులు కూడా ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. విశాఖ‌ప‌ట్నం జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు వైసీపీ అభ్యర్థులు హోమియో మందుల డబ్బా ల పై తమ పార్టీ గుర్తు అభ్యర్థి ఫోటో ముద్రించి అపార్ట్‌మెంట్ల‌లో పంపిణీ చేస్తున్నారు. 

 

ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఈ మందుల పంపిణీ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వారు బ‌లంగా విశ్వ‌సిస్తున్నార‌ట‌. దీంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మ‌రీ పంపిణీ చేస్తుండ‌టం విశేషం.  మీరు జాగ్ర‌త్త‌..మీ ఆరోగ్యం జాగ్ర‌త్త..కరోనాతో చాలా ప్ర‌మాదం..బ‌య‌ట అస్స‌లు తిర‌గ‌కండి...అంటూ కుష‌ల ప్ర‌శ్న‌లు వేస్తూ స‌మాధానాలు కూడా వారే చెబుతూ...చివ‌రికి మీ ఓటు మాత్రం మాకే వేయాలి అంటూ అభ్య‌ర్థిస్తున్నార‌ట‌. వైసీపీ అభ్య‌ర్థుల క‌రోనా మందుల ప్ర‌చార అస్త్రం గురించి విన‌డ‌మే కాదు ఆదివారం అంకయ్యపాలెం లోని ఓ పార్లమెంట్లో పంచడానికి తీసుకువచ్చిన హోమియో మందుల డబ్బాలను చూసి  అవాక్క‌య్యార‌ట‌.

 

ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఎన్నిక‌లు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌త్య‌క్ష ప్ర‌చారానికి తెర‌ప‌డిన‌..సోష‌ల్ మీడియాలో అభ్య‌ర్థులు ప్ర‌చారాన్ని విస్తృతంగా చేస్తుండ‌టం విశేషం. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆదేశాల‌తో విశాఖ జిల్లాలో 114 సెక్షన్‌ విధిస్తున్న‌ట్లు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. మందులు, ఆయిల్‌, గ్యాస్‌ తయారీ సంస్థలు మినహా మిగిలిన ఉత్పత్తి సంస్థలు ఏవీ పనిచేయకూడదని వివరించారు. ఈ నిబంధనలన్నీ ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయన్నారు. నిత్యావసర సరకులు తీసుకువెళ్లే వాహనాలు, రోగులను తరలించే వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: