దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.  ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు ప్రాణభయంతో బతికే పరిస్థితి ఏర్పడింది.  కరోనా వ్యాప్తితతో యావత్‌ ప్రపంచం ప్రమాదపుటంచుల్లో ఉన్న దశలో కరోనాతో పోరాడడానికి రూ.100 కోట్ల భారీ విరాళాన్ని వేదాంత గ్రూప్స్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  'దేశంలో అత్యవసరం అయినపుడు ఈ నిధి ఉపయోగపడుతుంది. రోజూవారీ కూలీలకు, ఇబ్బందులు ఎదుర్కొనే వారికి తన వంతుగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.  

 

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వందకోట్లు ప్రకటిస్తున్నాను అన్నారు. నాకు తోచినంత వారికి సాయం అందిస్తాను' అని అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఆయన స్పందించిన తీరుకు, ఉదాత్త హృదయానికి నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  దేశానికి ఇప్పుడు మన అవసరం ఉందన్న అనిల్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా రోజువారీ కూలీల గురించి తాను ఆందోళనకు గురవుతున్నానని చెప్పారు. వారికి తనకు తోచినంత సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేసేందుకు ముందుకొచ్చిన  అనిల్‌ను  పలువురు అభినందిస్తున్నారు.  నిన్నటి జనతా కర్ఫ్యూ యావత్ భారత దేశాన్ని ఒక్కతాటిపై తీసకు వచ్చింది.. ఇదీ భారతీయుల గొప్పతనం అన్నారు.  మనం తల్చుకుంటే ఈ కరోనా వ్యాప్తిని సులువుగా తరిమి కొట్టేయొచ్చు అని అన్నారు.  దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు అనిల్ అగర్వాల్. సామాజిక దూరాన్ని పాటించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.  అంతే కాదు  పలు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు సైతం కరోనా పోరాటం భాగస్వామ్యమవుతున్నాయి. కరోనాని నిర్మూంలించేందుకు కంకణం కట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: