వైవాహిక సంబంధాలు ఈరోజుల్లో ఎక్కువ రోజులు నిలబడం లేదు. దీనికరణలు అంకేమని చెప్పవచ్చు. అనుమానాలు, అక్రమ సంబంధాలు ఇలా అనేక రకాల ఇంటి సమస్యల వల్ల వారి వైవాహిక జీవితాలలో గొడవాలు వచ్చి వారు విడి పోయే వరకు దారి తీస్తున్నాయి. ఇలాంటి ఇంతంగా ముందు పాశ్యాత్య దేశాలలో ఎక్కువుగా చూసేవాళ్లం. కానీ ఈరోజులలో మనదేశంలో కూడా ఇలాంటి పరిపాటిగా మారిపోయాయి.

 

 

 

ఇక అసలు విషయానికి వస్తే తమిళనాడు రాష్ట్రంలో ఐదు నెలల గర్భిణిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విష్యం ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది. రాష్ట్రంలోని పళ్లిపట్టు ప్రాంతంలోని నెడియం దళితవాడకు చెందిన వరప్రసాద్ (24) అనే యువకుడు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తు ఉండేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన కార్తీక (21) ని చెంగల్పట్టులోని ఒక కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుకొనేది. ఇలా రోజూ కాలేజీకి పోయివచ్చే క్రమంలో వారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. అయితే వారిద్దరి పెద్దల అంగీకారంతో రెండు సంవత్సరాల క్రితం వారి వివాహం చేసుకున్నారు.

 

 


ఆలా సుకంగా సాగుతున్న సంసారంలో ప్రస్తుతం కార్తీక ఐదు నెలల గర్భవతి. ఎందుకు ఏమి అయిందో తెలియదు ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా మారడంతో వరప్రసాద్ శనివారం కోనేటం పేట లోని మండల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే కార్తీకను పరీక్షించిన డాక్టర్లు ఆమె చనిపోయినట్లు వారు తెలిపారు. దీనికోసం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి పంపారు. ఆ తర్వాత తమ కూతురు మృతిపై అనుమానం వచ్చిన కార్తీక తండ్రి పళ్లిపట్టు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దింతో పోలీసులు వరప్రసాద్‌ ను అదుపులోకి తీసుకుని వారి స్టైల్ లో విశారన చేస్తున్నారు. ఈ కేసు విషయమై తిరుత్తణి ఆర్డీఓ దర్యాప్తు మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: