ప్రస్తుతం ప్రపంచంలో రోజురోజుకి అత్యధికంగా కరోనా వైరస్ నమోదు అలాగే మరణాలు ఎక్కువగా ఉన్న దేశం ఇటలీ. అక్కడ ప్రతి రోజూ ఆ దేశంలో వందలాది మంది కోవిడ్-19 మహమ్మారి చేరుతుంది. ఇప్పటి వరకూ ఇటలీలో 5,495 మంది మృతిచెందగా, ఇంకా బాధితుల సంఖ్య 60వేల పైననే చేరుకుంది. అలాగే ఉత్తర ఇటలీలోని లొంబార్డే ప్రాంతంలో ఇప్పటి వరకు అత్యధికంగా 3,500 మందికి పైగా ప్రాణాలు వదిలారు.

 

 


అంతేకాకుండా వైరస్ నియంత్రణకు ఇటలీ ప్రభుత్వం చేస్తున్న ఎలాంటి చర్యలు మంచి ఫలితాలు ఇవ్వడంలేదు. దేశం మొత్తం మీద ఆరు కోట్లు ఉన్న జనాభా, ఇప్పుడు  ఇటలీలో ఎక్కడ చూసిన కరోనా సోకి మరణించిన వారి శవాలతో నిండిపోయింది. నిజానికి అక్కడ శవాలను పూడ్చిపెట్టడానికి కూడా స్థలం లేదు అంటే నమ్మండి. అక్కడ కోవిడ్ బాధితులకు వైద్యం చేయడానికి హాస్పిటల్స్ కూడా సరిపోవడంలేదు. దీనితో ఆరు బయటే టెంట్ వేసి వైద్యం చేసే దుస్థితికి ఇటలీ దేశం దిగజారింది.

 

 

 


ఇలా ఆ దేశంలో కరోనా వైరస్‌ తో మరణించిన వారిలో ఎక్కువ శాతం 60 ఏళ్ళు దాటినవారే ఉన్నారంట. అయితే ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో వారి దేశ ఉత్పాదకతను తగ్గించిన ఇటలీ, లాంబొర్డే ప్రాంతంలో పూర్తిగా పరిశ్రమలను లాక్ అవుట్ చేసింది. దీనితో ఇక్కడ ప్రజలని ఎవరూ ఇళ్ల నుంచి రావద్దని ఆదేశాలు కూడా అక్కడి అధికారు ఇచ్చారు. అంతే కాకుండా ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగతంగా ఇతరులతో కలిసిమెలిసి ఉండకూడదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో వైరస్ లక్షణాలు కోడిగా తగ్గు ముఖం పట్టాయని చెప్పవచ్చు.  

 

 

 

అయితే డాగ్ వాకింగ్‌ పై కూడా ఇటలీ ఆంక్షలని విధించింది. ఈ వాకింగ్‌ లో పాల్గొనే వారు కనీసం 200 మీటర్ల దూరం పాటించాలని ఆ దేశ అధికారు తెలిపారు. బహిరంగ ఆడే క్రీడలను నిషేధించడమే కాకుండా, ఇళ్లలో కూడా ప్రాక్టీస్ చేయరాదని ఆదేశాలు జారీ చేసారు. అయితే లొంబొర్డే ప్రాంతంలో నిబంధలను అతిక్రమించిన వారికి ఏకంగా  జరిమానాను అధికారులు 5,000 యూరోలకు పెంచారు. ఇది మన దేశ కరెన్సీలో సుమారు నాలుగు లక్షలకి సమానం.

మరింత సమాచారం తెలుసుకోండి: