ఇప్పుడు దేశంలో ఎవరి నోటి వెంబటి విన్నా కానీ ఒక పేరు మారుమోగుతోంది.  అది ఏ హీరోనో, హీరోయినో, రాజకీయా నాయకులో, సెలబ్రిటీ పేరో కాదు ఒక వైరస్ గూర్చి. అదే కరోనా వైరస్  ఎక్కడో చైనా లో విజృంభించి మన భారత దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. అందుకే మన దేశ ప్రధాని నరేంద్రమోడీ  కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే విధంగా ఒక ఆలోచన చేసారు. దాని పేరే జనతా కర్ఫ్యూ. దానిలో భాగంగానే ఈ  ఆదివారం అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు.

 

ఎవరు తమ ఇళ్లలో నుంచి బయటకి రాకుండా స్వచందంగా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. అయితే దీనికి మద్దతుగా ప్రజలు అందరు ఇంటికే పరిమితం అయ్యారు. బయటకి ఎవ్వరు రాలేదు. కాని  దీనిని  వ్యతిరేకిస్తూ తెలంగాణా  టీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అసలు వివరాలలోకి  వెళితే  సంగారెడ్డి మున్సిపాలిటీ 34 వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ సామీ జనతా కర్ఫ్యూ ని  అలాగే  ప్రధాని నరేంద్రమోడీని  వ్యతిరేకిస్తూ  తీవ్ర విమర్శలు చేశారు.

 

ఇతడి వీడియో ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ప్రధాని నరేంద్రమోడీ  జనతా కర్ఫ్యూ వెనక మతతత్వం ఉందని.. ముస్లింలంతా జనతా కర్ఫ్యూను తీవ్రంగా వ్యతిరేకించాలని మహ్మద్ సామి వీడియోలో తెలిపారు . అంతేకాకుండా ముస్లింలు మసీదులలో ప్రధాని నరేంద్రమోడీకి కరోనా వైరస్ రావాలని ప్రార్థించాలని ఆయన కోరారు. సీఏఏ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ లను రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. అతడి తీవ్ర విమర్శల వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది .  కరోనా వైరస్ ని తగ్గించడానికి మోడీ  జనతా కర్ఫ్యూ కి పిలుపునిస్తే  దానిని కూడా రాజకియం చేసారు అని కొంతమంది పలువురు  తీవ్రంగా విమర్శించారు.

 

ఇతడి వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆదివారం సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి మహ్మద్ సామిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని గృహనిర్బంధంలో ఉంచారు.అయితే పోలీసులు కొట్టుదిట్టమైన బందోబస్త్ తో పహారి కాస్తున్నారు. ప్రజలు కూడా పోలీస్ లకు సహకరించాలని కోరారు. 

 

కరోనా నియంత్రణ చర్యలను వ్యతిరేకిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విపత్తు పరిస్థితి లో   అందరూ ప్రభుత్వం ఆదేశానుసారం నడుచుకోవాలని, కాదని ఇష్టానుసారం చేస్తే  కేసులు తప్పవని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు కూడా సహకరిస్తే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: