ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయంమే. ఇప్పుడు ఈ కరోనాను అడ్డం పెట్టుకొని కొంత మంది మార్కెటింగ్ వ్యవస్థవారు కోట్లు వెనుకేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా మాస్క్, శానిటైజర్స్ విషయంలో ఇప్పటికే బ్లాక్ మార్కెట్ నడుస్తున్న విషయం తెలిసిందే.  ప్రజలు దేని కోసం ఇబ్బంది పడుతున్నారో వాటిని బ్లాక్ చేసి వాటిని అధిక రేట్లకు అమ్మడం జనాలను ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకపోవడం కామన్ అయ్యింది. ఇక బంద్.. కర్ఫ్యూ అంటే కూరగాయలు... ఇతర సామాగ్రికి ఎక్కడ లేని రెక్కలు వస్తాయి.  దొరికిందే సందు అనుకుంటూ డబులు.. త్రిబులు రేట్లకు అమ్ముతుంటారు.  వాటిని సచ్చే చెడి కొనే పరిస్థితి సామాన్యుడిక ఏర్పడుతుంది.

 

 

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేశారు... కొంత కాలం ఇంటినిండా సరుకులు నింపుకోవాలన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జనాలు కూరగాయల మార్కెట్ కి పోయి అక్కడ రేట్లను చూసి కళ్లు తిరిగిపడిపోతున్నారు.  మొన్నటి వరకు రూ.10 కి బతిలాడి మరీ ఇచ్చిన టమాటాలు ఇప్పుడు రూ. 100 అంటున్నారు. వంకాయ రూ.80 ఇలా ఒక్కటేమిటి ఆకు కూరల రేట్లు కూడా పెంచేశారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ధరలు పెరిగిపోతాయన్న అపోహ ప్రజల్లో నెలకొంది. 

 

భయంతో  వెంటనే మార్కెట్లలోకి వెళ్లి నిత్యావసర సరుకులు కొనుక్కుంటున్నారు.   వీటిపై అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌, మోహదీ పట్నం రైతు బజార్‌ల్లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి.  హైదరాబాద్‌లోనే కాదు నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లోనే ఇటువంటి పరిస్థితులే వినియోగదారులకు ఎదురవుతున్నాయి. మరోవైపు ఇలా రేట్లు పెంచి అమితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పుడు  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చిరికలు జారీ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: