ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒకలెక్క. నిన్న మొన్నటి వరకు ధరలు లేని కూరగాయలకు ఒకేసారి రెక్కలు వచ్చి ఆకాశానికి అంటుతున్నాయి.. కాదు దళారులు అంటిస్తున్నారు.. దయలేని దోపిడి దారులు కరోనా పేరుతో కరెన్సీనోట్లతో కడుపులు నింపుకుంటున్నారు.. ఇప్పటికే ఎక్కడికి వెళ్లలేక బ్రతుకు తెరువులేక నానా కష్టాలుపడుతున్న మధ్య, దిగువ తరగతి ప్రజలు ఎలా బ్రతకాలో తెలియని పరిస్దితులు రాష్ట్రాల్లో తలెత్తుతున్నాయి.. కరోనా దెబ్బకు ఖాళీకడుపుతో పడుకునే పరిస్దితులు తలెత్తుతున్నాయి..

 

 

కరోనా వైరస్ దెబ్బకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్‌లో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఇదే అదనుగా సామాన్యులను కూరగాయల వ్యాపారులు నిలుపు దోపిడి చేస్తున్నారు. దీంతో వ్యాపారులపై కొనుగోలుదారులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. ఇకపోతే నిత్యావసర సరుకులు,  కూరగాయలు అందుబాటులోనే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చినా.. ప్రస్తుతం సాధారణ రోజుల కంటే రెండింతల ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు.

 

 

మార్కెట్‌ అధికారులు చేతులెత్తేయడంతో వ్యాపారులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దాదాపు అన్ని కూరగాయల రేట్లు ఇలానే ఉన్నాయి. నగరంలోని గుడిమల్కాపూర్‌ , మోహదీపట్నం వ్యవసాయ మార్కెట్‌లో కూడా కూరగాయల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఇదిలా ఉండగా అన్ని మార్కెట్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి.. లాక్‌డౌన్‌ రూల్స్‌ను పాటించకుండా ప్రజలు పెద్దఎత్తున బయటకు రావడం వల్ల కోరోనా నివారణ ఎలా సాధ్యమవు తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

 

 

మరోవైపు కూరగాయల ధరలు కూడా అధికంగా ఉన్నాయని  ప్రజలు వాపోతున్నారు... ఇలా మారని లోకంతో మరణాలు ఎక్కువ అవుతాయి.. అంతే కాదు శవాల మీదపడిన రాబందులల్లే వ్యాపారులు కూడా దండుకుంటున్నారు.. చీ నీతిలేని మనుషులు.. ఒకరికి కష్టం వస్తే అందరికి వచ్చిందను కోకుండా ఇదే అదనుగా ఇలా దోచుకునే వారిపట్ల ప్రభుత్వం దయలేకుండా ప్రవర్తించి పేదలను కాపాడాలి, కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టాలి.. లేదంటే రాష్ట్రం మరో ఇటలీ అవుతుంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: