ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి దారుణంగా పెరిగిపోతూ అందరిని భయాందోళనకు గురిచేస్తోంది. ప్రతోక్క దేశం, రాష్ట్రం, జిల్లా ఇలా అన్ని ప్రాంతాల ఆసుపత్రిలలోని వైద్య సిబ్బందికి ఈ కరోనా విస్ఫోటనాన్ని ఎదుర్కొనేందుకు పెద్ద సవాలుగా మారింది. మరోవైపు లక్షల సంఖ్యలో ఉన్న ప్రజలను కరోనా టెస్ట్ లు చేసేందుకు వైద్య సదుపాయాలు సరిపోవడం లేదు. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇటువంటి పరిస్థితే ఎదురవుతోంది. నిన్న ఒక్కరోజే 49 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోగా... మొత్తం కరోనా కేసుల సంఖ్య 35 వేలు దాటింది. అనుమానితుల సంఖ్య కూడా లక్షల సంఖ్యలో ఉందంటే అతిశయోక్తి కాదు. మరి ఇటువంటి కరోనా అనుమానితులందరిని పరీక్షించేందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టెస్టింగ్ కిట్ తప్పనిసరి.

 

 

 

ఇప్పటికే అమెరికాలోని పరిశ్రమలు కిట్లను సూపర్ ఫాస్ట్ గా తయారు చేస్తున్నాయి కానీ అందరికి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. అయితే ఎటువంటి సిచువేషన్ లో ఒక దొంగ అరిజోనాలోని టక్సన్  ప్రాంతంలోని ఎల్ రియో ఆస్పత్రిలో కి చొరబడి 29 కొత్త కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లను ఎత్తుకు పోయాడు. ఆస్పత్రి లోకి ప్రవేశించి తనను తాను డెలివరీ బాయ్ గా చెప్పుకున్నాడు ఈ 30 ఏళ్ల దొంగ. అసలే కరోనా కేసుల తో హడావుడిగా ఉన్న ఆ ఆసుపత్రి సిబ్బంది ఇతనిని అంతగా పట్టించుకోలేదు. అదే అదనుగా భావించిన ఈ దొంగ ఏకంగా 29 టెస్టింగ్ స్కిట్లను ఎర్ర కారులో వేసుకుని అక్కడి నుండి పరారయ్యాడు. 

 

 

అయితే కిట్లు మాయమైన విషయం గురించి మర్నాడు ఉదయం అనగా ఆదివారం ఉదయం ఆ క్లినిక్ వైద్య సిబ్బంది తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... వారు సీసీ టీవీ ఫుటేజ్ ని సామాజిక మాధ్యమాలు షేర్ చేసి... ఎవరైనా కరోనా టెస్టింగ్ కిట్లను బ్లాక్ లో ఎక్కువ ధరకి అమ్ముతామని చెబితే వాటిని కొనకండి... మాకు వెంటనే సమాచారం అందించండి అంటూ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్లు మాత్రం విస్తుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: