కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎంత డేంజర్ గా తయారైందో ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.  ఈ కరోనా మహమ్మారి వల్ల చైనా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా ఇతర  దేశాల్లో పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.   ఈనెల 31వ తేదీ వరకు సర్వీసులు నిలిపి వేస్తున్నట్లు ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలు ఓలా, ఊబర్‌ ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ ప్రకటించడంతో ప్రైవేటు సర్వీసులు కూడా నిలిపివేయాలన్న సర్కారు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఇప్పటికే  ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్చి 31వ తేదీ వరకు తమ క్యాబ్ లను బంద్ చేశామని ఆయా సంస్థలు ప్రకటించాయి.

 

అత్యవసర సర్వీసులకు చెందిన కొన్ని వాహనాలను మాత్రమే నడుపుకునేందుకు కేంద్రం అనుమతించిందని ఓలా అధికార ప్రతినిధి తెలిపారు.   కరోనా వైరస్ బారిన పడిన డ్రైవర్ పార్టనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఓలా రూ.30 వేల వరకు కవరేజ్ ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఓలా డ్రైవర్ పార్టనర్లకు ఈ ఆఫర్ ప్రకటించింది. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత నుంచి రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ఈ పరిహారాలు అందించనున్నామని పేర్కొంది. డ్రైవర్లు లేదా వారి జీవిత భాగస్వాములు మెడికల్ డాక్యుమెంట్లను సమర్పించి ఈ క్లయిమ్స్‌‌ను పొందవచ్చు.

 

ఈ కవరేజ్ వెనువెంటనే అందుతుందని, ఓలా బైక్, ఓలా ఆటో, ఓలా రెంటల్స్, అవుట్‌‌స్టేషన్ డ్రైవర్ పార్టనర్లందరకూ ఈ కవరేజ్ ఇస్తామని తెలిపింది.   డ్రైవర్ పార్టనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మెడికల్ సాయం అందిస్తోంది. డ్రైవర్ పార్టనర్లు ఎంఫైన్ ప్లాట్‌‌ఫామ్ ద్వారా ముగ్గురు డాక్టర్లను ఉచితంగా కన్సల్టేట్ అవ్వొచ్చు. 500 మంది పెద్ద డాక్టర్లను ఈ ప్లాట్‌‌ఫామ్‌‌పైకి తెచ్చామని కంపెనీ వర్గాలు తెలిపాయి. అత్యవసర సర్వీసులకు చెందిన కొన్ని వాహనాలను మాత్రమే నడుపుకునేందుకు కేంద్రం అనుమతించిందని ఓలా అధికార ప్రతినిధి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: