ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్.. హైదరాబాద్‌, అటు ఏపీ విజ‌య‌వాడ‌, వైజాగ్ ఇలా ప‌లు న‌గ‌రాల్లో అడుగుపెట్టింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, , తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే, హైదరాబాద్‌కి చెందిన వ్యక్తికి కూడా ఈ లక్షణాలు కనిపించగా.. ప్రతి ఒక్కరూ కరోనా అంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే..వ్యాధి గురించి సరైన అవగాహన తెచ్చుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. అంటే ఈ వ్యాధి ఎలా వస్తుంది. ఎలాంటి లక్షణాలు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.. ఇలాంటి విషయాలన్నింటి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం మ‌న‌కు చెబుతూనే ఉంది. అయినా స‌రే చాలా మంది ఈ వ్యాధి ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు.

 

ఇక ఇటు రెండు రాష్ట్రాల సీఎంలు ఈ విష‌యంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను ఈ వ్యాధి సోక‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా కాపాడేందుకు వారి స‌హాయం వారు ఓ ప‌క్క చేస్తూనే ఉన్నారు. కుదిరినంత వ‌ర‌కు కూడా ఇళ్ళ‌లోనుంచి బ‌య‌ట‌కు రాకుండా ప‌నులు చెయ్య‌మ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తున్నారు. ఇక‌ రేష‌న్‌కార్డు దారులకు  ఈ రెండు ప్ర‌భుత్వాలు కూడా కేసీఆర్‌, జ‌గ‌న్ వీరిద్ద‌రూ కూడా అధిక రేష‌న్‌ని ఇవ్వ‌డ‌మేకాక ప‌దిహేను వంద‌ల డ‌బ్బులు కూడా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే దీనికి ప్ర‌జలు వారిద్ద‌రి కాళ్ళ‌కి మొక్కుతున్న‌రు.

 

అయితే వీరు ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌కొర‌కు ఆలోచించి ఎంతో పెద్ద మ‌న‌సు చేసుకుని వీరు ప్ర‌క‌టించిన ఈ హామీ బాగ‌నే ఉంది కాని ఇక అస‌లు విషయానికి వ‌స్తే... దేవుడు వ‌ర‌మిచ్చినా పూజార్లు వ‌ర‌మివ్వ‌ర‌ని. వీళ్ళ‌యితే ప్ర‌క‌టించారు కాని అది సామాన్య ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు చేరుతుంది. వీళ్ళు ఇచ్చే రేష‌న్‌, డ‌బ్బులు అస‌లు వాళ్ళ‌కు వెళుతుందా లేదా అనే కోణంలో మాత్రం ఎవ‌రూ ఆలోచించ‌డం లేదు. ఈ రేష‌న్ డ‌బ్బులు వారి వ‌ర‌కు చేరుతుందా? ఇదే అదునుగా తీసుకుని మ‌ధ్య‌లో దీన్ని తినేసేవారు ఎంత మంది సామాన్య ప్ర‌జ‌లుకు చేర‌డం అది చేర‌డం కూడా చాలా క‌ష్టం. గ‌తంలో ఇలాంటివి మ‌నం ఎన్నో చూశాం. అయితే ప్ర‌భుత్వం దీని పైన చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బావుంటుంద‌ని సామాన్య ప్ర‌జ‌ల కోరిక‌.

మరింత సమాచారం తెలుసుకోండి: