ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇటలీలో ఎక్కువగానే ఉంది. చైనా తర్వాత ఎక్కువ మంది చనిపోతుంది ఇటలీలోనే. అక్కడ రోజుకు కొన్ని వందల మంది చనిపోతున్నారు. అక్కడ రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అక్కడి ప్రభుత్వానికి ఎం చేయాలో, అక్కడి ప్రజలను ఎలా కాపాడుకోవాలో అర్ధం కానీ స్థితిలో కన్నీరు పెడుతుంది.

 

ఇప్పటికే ఇటలీలోని సామాన్య ప్రజలతో పాటు వేలాది మంది డాక్టర్లు, నర్సులు కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌ను అదుపు చేయడం ఇటలీకి తలకు మించిన భారం అవుతోంది. దీంతో ఆ దేశం సాయం కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తోంది. ఇటలీని ఆదుకునేందుకు క్యూబా డాక్టర్ల బృందాన్ని ఆ దేశానికి పంపింది.

 

ఇలాంటి రోగాలు ప్రబలిన సమయంలో సాటి దేశాలను ఆదుకోవడంలో క్యూబా ముందు వరుసలో నిలుస్తోంది. హైతీలో కలరా సోకినప్పుడు, పశ్చిమాసియాలో ఎబోలా ప్రబలినప్పుడు.. ఆ దేశం వైద్య బృందాలను పంపి సాయం చేసింది. ఇటలీలోని లొంబార్డీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో... ఇక్కడికి క్యూబా తన డాక్టర్లను పంపింది. 1960 నుంచి క్యూబాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 

ఇటలీ సాయం కోరగానే చైనా స్పందించింది. వెంటనే డాక్టర్ల బృందాన్ని, అవసరమైన మందులను పంపించింది. రష్యా కూడా డాక్టర్ల బృందాన్ని, మందులను పంపిస్తోంది. భారత్ కూడా మందులు, ఇతర వైద్య సామాగ్రిని పంపించింది. కానీ సాటి యూరోపియన్ దేశాలు సాయం చేయడానికి ముందుకు రావడం లేదని ఇటలీ వాపోతోంది.

 

ఇటలీలో 60 వేల మంది కరోనా బారిన పడ్డారు. అందులో 5476 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనా వైరస్ తో ఒక్క రోజులోనే ఇటలీలో 651 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తుండటంతో... శవాలను ఖననం చేయడానికి కూడా వేచి చూడాల్సి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: