అవును కరోనా వైరస్ విషయంలో ఏ మాత్రం ఆదమరిచినా సరే శవాల దిబ్బ అవ్వడం ఖాయం. ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక మహమ్మారి తో యుద్ధం చేస్తుంది. ఏ విధంగా ప్రయత్నాలు చేసినా ఎన్ని విధాలుగా దాని మీద పోరాటాలు చేస్తున్నా అది మాత్రం వెనక్కు తగ్గే పరిస్థితిలో లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చావు అంచున నిలబడి ఉంది. అది ఇప్పట్లో తగ్గదు. దాన్ని ఇప్పట్లో అదుపు చేయడం అనేది మన వల్ల కాని పని. 

 

కాని కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చు. అందరూ సమిష్టిగా పోరాటం చేస్తే దాన్ని అదుపు చేయడం అనేది పెద్ద విషయం కానే కాదు. కరోనా వైరస్ అనేది తెలంగాణా సిఎం కెసిఆర్ చెప్పినట్టు అది ఆత్మ గౌరవం ఉన్న రోగం. దాని మాట మనం వినే పరిస్థితి అది తెచ్చుకుంటుంది. దాని దగ్గరకు మనం వెళ్తే ఆ పరిస్థితి మనకు వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే... మనం దాన్ని దగ్గరకు పిలవకూడదు. నిపుణుల అంచనా ప్రకారం కరోనా వైరస్ అనేది... తక్కువలో తక్కువ... 20 కోట్ల మందికి కేవలం మన దేశంలోనే వ్యాపించే అవకాశాలు ఉన్నాయి అనేది వాస్తవం. 

 

కాబట్టి దాన్ని మనం దగ్గరకు రానీయకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా సరే కనీసం 30 లక్షల మంది దానికి బలైపోవడం ఖాయం. చాదస్తాలు వీడి ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాల్సిన సమయం ఆసన్నమైంది అనే విషయం అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ మాత్రం ఆదమరిచినా సరే కుక్క చావు కంటే హీనమైన చావు మనకు రావడం అనేది దాదాపుగా తధ్యం. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మీరు చావకండి... ఎదుటి వాళ్ళను చంపకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: