పుట్టిన ప్రతి పసిపిల్లలు పక్క తడపడం అనేది సర్వసాధారణమైన విషయం. ఆరేడు సంవత్సరాల వరకు పిల్లలు పక్క తడుపుతునే ఉంటారు. అయితే ఐదు సంవత్సరాల తరువాత కూడా ఇదే అలవాటుని వారు కొనసాగిస్తే... ఆందోళన పడాల్సిన అనారోగ్య సమస్య వారిలో ఉందని భావించాలి. పిల్లలు పక్కలో మూత్రం పోయడానికి గల సాధారణమైన కారణాలు ఏంటంటే... గదిలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా అనగా చల్లగా ఉండటం, నిద్రపోయే ముందు ఎక్కువగా శీతల పానీయాలు, మంచినీళ్లు తాగడం లాంటివి అన్నమాట. ఒకవేళ పిల్లలకు ఏడు సంవత్సరాలు దాటి ఉండి కూడా తరచుగా పక్క తడుపుతుంటే ఈ కింద పేర్కొన్న ఆరోగ్య సమస్యలలో ఏదో ఒకటి అయ్యుంటుందని మీరు గమనించాలి.



1. పిల్లలలో మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం, లేకపోతే అభివృద్ధి చెందే దశలో ఉండటం లాంటివి పిల్లల యొక్క మూత్రముని నియంత్రించే శక్తిని తగ్గించి వేస్తాయి.




2. మూత్రాశయం బాగా నిండిపోయినా కొంతమంది పిల్లలకు మాత్రం అది గ్రహించే శక్తి ఉండదు. ఒకవేళ మూత్రనాళం నిండినట్టు పిల్లలకు తెలిసినా వారు మాత్రం మొండిగా అంతే బాత్రూంకి పోకుండా ఉంటారు. అయితే ఇలాంటి అలవాటును మాన్పించేందుకు మీరు వారిని కాస్త మందలించి దార్లో పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీ పిల్లల ఆహారంలో కాఫిన్ లాంటి పదార్థాలు ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడండి.




3. ఒకవేళ మీ పిల్లవాడు పక్క తడపడం మానేసి మళ్లీ కొన్నేళ్ల తర్వాత పునఃప్రారంభిస్తే దానికి... మధుమేహం, అతిమూత్ర విసర్జన సమస్య, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఒత్తిడి, మానసిక సమస్య, జన్యుపరమైన సమస్యలు కారణం కావచ్చు. పిల్లవాడు ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వారంలో నాలుగైదు సార్లు పక్క తడిపే అలవాటు మనకపోతే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.




ఇకపోతే మీ పిల్లవాడి వయసు ఏడు సంవత్సరాల లోపు ఉండి ఉంటే ఈ కింద పేర్కొన్న సూత్రాలను పాటించి పక్క తడుపుట అలవాటును మాన్పించడం.



మీ పిల్లలకు చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అసలు తినిపించండి. అలాగే కాన్బెర్రీ జ్యూస్ తరచుగా తాగించండి. వాల్ నట్స్, కిస్మిస్లు తినిపించండి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మూత్ర వ్యవస్థ పెరుగుదలకు తోడ్పడుతుంది. అరటి పండ్లను కూడా ఎక్కువగా తినిపించండి. రాత్రి వేళల్లో తప్ప మిగతా ఏ సమయంలోనైనా మీ పిల్లలకు అరటిపండ్లను తినిపించవచ్చు. దాల్చిన చెక్క తేనెలో కలిపి తాగించండి. అలాగే వీలైతే హెర్బల్ టీ తాగించండి.





మరింత సమాచారం తెలుసుకోండి: