కరోనా ఇప్పటికే కలకలం సృష్టించింది. ప్రతీ ఒక్కరిని భయ పెడుతోంది. ఈ మహమ్మారి అదుపు లేకుండా ప్రాణాల పై పడి చెలగాటం ఆడుతోంది. అయితే దీనిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోంది. నిన్న లాక్ డౌన్ చేసిన పట్టించుకోవడం లేదు ప్రజలు. ఈ లాక్ డౌన్ ప్రజలు దాటితే చర్యలు తప్పవు అని అంటున్నారు .

 

 

అయితే ఇప్పటికే రైళ్లు, బస్సులు వంటివి రద్దు చేసారు. అలానే లాక్ డౌన్ చెయ్యాలని చెప్పారు. ప్రజల్ని ఇళ్ల నుండి బయటకి రావద్దు అని కూడా చెప్పారు. ఓలా , ఉబర్ క్యాబ్ సంస్థల్ని కూడా మూసేయాలని సూచించారు. ఎవరిపైన ఈ నిబందన దాటితే క్రిమినల్ చర్యలు తప్పక తీసుకుంటాం అంటున్నారు. లాక్ డౌన్ ని ఉద్దేశించి సీపీ సజ్జనార్ మాట్లాడారు.

 

 

సోమవారం ఆయన మీడియా సమావేశం పెట్టారు. దానిలో సీపీ సజ్జనార్ ఇలా అన్నారు. బయటకి ఎవరు రాకూడదు , ఒకవేళ అత్యవసరం అయితేనే బయటకి రండి అని అన్నారు. అంతే కాకుండా క్యాబ్లు వంటి వాటిని ఈ పరిస్థితిలో కూడా బుక్ చేసుకోవద్దు అని ఆయన సూచించారు . 

 

 

ఈ మధ్య ఆంబ్యులెన్స్ లోనే జనాలని తరలించారట. ఆ విషయం వారి దృష్టి లో ఎప్పుడో పడింది అని అన్నారు. ఇలా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలని తీసుకోక తప్పదు అని ఆయన అన్నారు. నిబంధనలకు కట్టుబడి ఉండలేని వారిపై చర్యలు తీసుకోవడం తధ్యం అన్నారు .

 

 

అంతే కాకుండా పిల్లల్ని ఎక్కడికి తీసికెళ్లవద్దు అని అయన చెప్పారు. ఏది ఏమైనా ఏడు నుండి ఏ షాపైనా మూసేయాలి అని ఆయన అన్నారు. ప్రయాణాలు కూడా చెయ్యకూడదు అని చెప్పారు సీపీ సజ్జనార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: