దేశంలో కరోనా మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 420 కి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రస్తుతం రెండో దశలో ఉంది. ఒక్క మహారాష్ట్రలో మాత్రం దీని తీవ్రత ఎక్కువగా ఉంది. అది మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అదుపు చేసే దశలో ఉంది కాబట్టి ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇది పక్కన పెడితే కరోనా వైరస్ తీవ్రత వలన... మరణాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

కరోనా వైరస్ కారణంగా మరణించే వారి సంఖ్య రాబోయే వరం రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు దేశంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బాధితుల సంఖ్య మరింతగా పెరిగితే మాత్రం ఇబ్బంది పడటం ఖాయమని అంటున్నారు. వ్రుద్దులను రక్షించుకోవడం అనేది ఇప్పుడు ప్రభుత్వాలకు పెను సవాల్ లాంటిది. యూరప్ దేశాల్లో మరణించే వారిలో వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారిలోనే మరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

దేశం మొత్తం ప్రభుత్వాలు కఠిన చర్యలను అమలు చేస్తున్నా జనం మాట వినడం లేదు కాబట్టి దీని తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాల మాట వినే స్థితిలో ప్రజలు లేరు. వాళ్లకు ఎవడూ చెప్పలేని పరిస్తితిలో ఉన్నారు. ఇంట్లో ఉండండి రా బాబూ అని మొత్తుకుని చెప్తున్నా పిల్లలు పెద్దలు ఎవరూ ఆగడం లేదు. మరి ఇంకెంత మంది దీని కారణంగా బలవుతారో చూడాలి. మన దేశంలో జనాబా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మందికి సోకే అవకాశాలు ఉన్నాయి. జనాలు మాట వినకపోతే మాత్రం అది ఎవరికి సోకుతుందో కూడా చెప్పలేము. ఎలా వస్తుందో కూడా అర్ధం కాదు కాబట్టి జాగ్రత్త అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: