చంద్రబాబునాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం ఇంకా కంటిన్యు అవుతున్నట్లే ఉంది. అప్పుడెప్పుడో రాష్ట్ర విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల విభజనను వ్యతిరేకించమని అడిగినపుడు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చాడు చంద్రబాబు. తెలంగాణా నేతలంతా మూకుమ్మడిగా రాష్ట్ర విభజన డిమాండ్ చేస్తుంటే సీమాంధ్రుడిగా ఉంది చంద్రబాబు కూడా తెలంగాణానే కోరుకున్నాడు. అందుకనే తెలంగాణాలో పార్టీ కుప్ప కూలిపోయింది.

 

ఇపుడీ విషయం ఎందుకంటారా ? ఏపిలో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా తన సిద్ధాంతాన్ని చంద్రబాబు కంటిన్యు చేస్తునే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడదామని అనుకుంటే చంద్రబాబు ఎంతగా వ్యతిరేకించాడో అందరూ చూసిందే.  అధికారపార్టీ, ప్రభుత్వం ఎంతగా చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. అలాంటిది తనింట్లో తన మనవడు దేవాన్ష్ కు మాత్రం ఇంగ్లీషే ముద్దంటున్నాడు.

 

ఈ విషయం ఇప్పటికే అనేక మార్లు చంద్రబాబును జగన్ అనేక వేదికలపై వాయించేశాడు. ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తున్న పెద్దమనుషులంతా తమ పిల్లలనో లేకపోతే మనవళ్ళు, మనవరాళ్ళను ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పమంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నోరెత్తలేదు. అయితే కరోనా వైరస్ పుణ్యామని కేంద్రప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా చంద్రబాబు బండారం బయటపడింది.

 

మొన్నటి ఆదివారం దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయిన విషయం తెలుసుకదా. ఆ సమయంలో అందరు ఎవరిళ్ళల్లో వాళ్ళుండిపోయారు. ఇందులో భాగంగానే చంద్రబాబు కూడా తన ఇంట్లో మనవడు దేవాన్ష్ దగ్గర కూర్చుని పుస్తకాలు చదివించాడు. ఆ సందర్భంలో దేవాన్ష్ పుస్తకం ఒకటి తీసుకుని చంద్రబాబు ఇంగ్లీషులోనే చదివి వినిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ విడియోను చంద్రబాబే తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు లేండి. ఇదే విషయమై నెటిజన్లు చంద్రబాబును వాయించేస్తున్నారు. మనవడు దేవాన్ష్ కేమో ఇంగ్లీషు మీడియమే కావాలి కానీ పేదలకు మాత్రం ఇంగ్లీషు మీడియం ఉండకూడదా ? అంటూ నిలదీస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: