విదేశీయులు, ఇతర దేశాల నుంచి వచ్చిన భారతీయుల వలన ఇండియాలో కరోనా కేసుల నమోదవడం ప్రారంభమయ్యాయి. దేశంలో మొట్టమొదటి కేరళలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఈరోజు మాత్రం కేరళలో ఏకంగా 28 కరోనా కేసులు ఒక్కరోజే నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా తమ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేరళలో 95 కేసులు నమోదు కాగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు.




ఈరోజు నమోదైన 28 కేసులు పూర్తి సమాచారం తెలుసుకుంటే... 19 కాసరగోడ్ జిల్లాలో నమోదు కాగా, కన్నూర్ లో ఐదు, ఎర్నాకుళంలో రెండు, పతనమిట్ట, త్రిస్సూర్లలో ఒక్కొక్కటి నమోదు అయ్యాయి. వారిలో 25 మంది దుబాయ్ నుండి వచ్చారు. మిగిలిన వారు దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్ లో ఉండగా వారికి కూడా కరోనా వైరస్ సోకింది.




ఇకపోతే రాష్ట్రం యొక్క లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలు యధావిధిగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు. అలాగే ప్రజా రవాణాని నిషేధించడం తో పాటు, రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేస్తున్నారు. అలాగే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరగడానికి అనుమతి లేదు. కాకపోతే ప్రైవేటు వాహనాలు అనగా కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉందని ముఖ్యమంత్రి పినరాయి వెల్లడించారు. రెస్టారెంట్లులలో తినడం నిషేధం కానీ ఇంటికి ఆహారాన్ని పార్సెల్ తీసుకోవచ్చు.





అలాగే వలస వచ్చిన కూలీలకు ఆశ్రమం కల్పించనున్నారు అధికారులు. వారికి మందులతో పాటు ఆహారం ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం పినరాయి ఆదేశాలు జారీ చేశారు. అలాగే కరోనా అనుమానితుల ఇంటికి ఆహారం సరఫరా చేయబడుతుంది. కాసరగోడ్ జిల్లాలో ఈరోజు కొత్త కేసులని కలిపి మొత్తం 38 నమోదు కాగా... ఆ జిల్లాలో కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేస్తున్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: