దేనికైనా టైమింగ్ ఉండాలి.. ఓ వైపు ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. మీడియా కూడా కరోనా వార్తలతో హోరెత్తిపోతోంది. ఏవో కొంపలు మునిగే వార్తలు తప్ప ఇతర వార్తలను పట్టించుకోవడం లేదు. అటు సుప్రీం కోర్టు కూడా తన విధులను కుదించేసుకుంది. ఏవో అర్జంటు కేసుల సంగతి తప్ప మిగిలినవన్నీ తర్వాత చూద్దామంటోంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది.

 

 

సరిగ్గా ఇలాంటి టైములో జగన్ చంద్రబాబును గురి చూసి కొట్టినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే.. రాజధాని భూముల వ్యవహారంపై జగన్‌ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరింది. గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ సీబీఐ దర్యాప్తును ఏపీ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే నమోదైన కేసుల వివరాలను ప్రభుత్వం సీబీఐకి పంపింది. కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేశామని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జీవో నెం.46ను ఏపీ హోంశాఖ కార్యదర్శి విడుదల చేశారు.

 

 

ఇది చాలా హైప్రొఫైల్ కేసు అని.. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయంగా కూడా దర్యాప్తు అవసరమనీ అందుకే సీబీఐకి అప్పగిస్తున్నామనీ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాదు.. ఇది మనీలాండరింగు వంటి సీరియస్ నేచర్ ఉన్న కేసు కాబట్టి.. ఏదైనా ప్రొఫెషనల్ జాతీయ దర్యాప్తు సంస్థ అయితే బెటర్ అనుకున్నామని అందుకే సీబీఐకి ఇస్తున్నామని చెప్పిందట.

 

 

ఈ మేరకు సీఐడీ కేసుల వివరాలు, అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, ఎస్సీ, ఎస్టీలను బెదిరించి భూములు కొనుగోళ్ల కేసులను సీబీఐకి బదిలీ చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది. సీబీఐ దర్యాప్తు ప్రారంభించి.. ఇప్పటికే చేతిలో ఉన్న ఆధారాల ప్రకారం చంద్రబాబును అరెస్టు చేస్తుందా... తనను పెట్టినట్టే చంద్రబాబును కూడా కొన్నాళ్లు జైళ్లో పెట్టాలని జగన్ కోరుకుంటున్నాడా.. మరి జగన్ కల నెరవేరుతుందా.. ఒక వేళ సీబీఐ అరెస్టు గిరస్టు అంటూ బెయిల్ కోసం చంద్రబాబు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా.. చూడాలి ఏం జరుగుతుందో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: