ప్రస్తుతం దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కరోనా  వల్ల ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. అధికారికంగా ఈ కరోనా  వైరస్ బారిన పడిన వారు కేవలం 300 మందికి పైగా ఉన్నప్పటికీ... ఈ వైరస్ లక్షణాలు ఉన్న అనుమానం మాత్రం భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజురోజుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ భారత్ మొత్తం నిర్బంధం దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం కేవలం మనుషులకే కాదు అన్ని రంగాలపై పడింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది. 

 


 ఇప్పటికే ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కరోనా  వైరస్ ప్రభావం తో మరింత దిగజారి పోతుంది. అయితే కరోనా  వైరస్ కారణంగా అతలాకుతలమౌతున్న దేశీయ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించే 366 ఆశ్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది అన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కానీ హోంమంత్రి అమిత్ షా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరూ ఆర్టికల్ 360 గురుంచి  ఎక్కడ డైరెక్టుగా కూడా మాట్లాడకపోయినప్పటికీ 
... కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల ద్వారా ప్రస్తుతం అందరిలో  ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

 


 ముఖ్యంగా బిజెపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు అయిన సుబ్రహ్మణ్యన్  స్వామి సోషల్ మీడియాలో చేసిన  వ్యాఖ్యలు  ప్రస్తుతం అందరిలో  ఆర్టికల్360  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించడం అనివార్యమేనా..? ప్రభుత్వం దీనిపై సందేహాలను నివృత్తి చేయాలి అంటూ స్వామి ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేవలం బిజెపి రాజ్యసభ సభ్యులు స్వామి చేసిన వ్యాఖ్యలే కాకుండా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు కూడా రోజురోజుకు ఘోరంగా పతనమవుతుండటం.. రూపాయి విలువ దారుణంగా పడిపోతుండటం... ఆర్టికల్ 360 విధించి  ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: