ప్రభుత్వ కార్యకలాపాలకు ఆర్థిక బడ్జెట్ ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఆర్థిక బడ్జెట్ ను బట్టి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టబడింది. మార్చి 31 వరకు ఆర్థిక  సంవత్సరం  చివరి తేదీ... ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలులోకి వస్తుంది. ఏ రంగానికి  ఎంత మొత్తంలో నిధులు కేటాయించాలని దానిపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ప్రభుత్వలు . వాస్తవంగా అయితే ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు ముగుస్తుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు లెక్కలు కూడా సమకూర్చుకుంటాయి. 

 

 అటు పార్లమెంట్ లో కానీ ఇటు అసెంబ్లీ లో కానీ ఆర్థిక సంవత్సర బిల్లు మాత్రం ప్రతి యేటా మార్చి 31తో ముగుస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడు  14వ ఆర్థిక సంఘం నిధులు ఇమీడియట్  విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం . రేషన్ విషయంలో కూడా ఆరు నెలలకు సరిపోయే రేషన్ కూడా ఉంది తీసుకెళ్లండి అంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటన చేసింది . ఇలా కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బడ్జెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇదిలా ఉంటే వైసిపి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రధాన మంత్రికి తాజాగా ఓ లేఖ రాశారు. 

 


 ఆర్థిక సంవత్సరం గడువును  ఒక నెలపాటు పెంచండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీ లేఖ రాశారు. అయితే ఎందుకు ఆర్థిక సంవత్సరానికి ఎక్స్టెండ్ చేయాలని ప్రధాని మంత్రి కోరారు అంటారా.. ప్రస్తుతం కరోనా  వైరస్ రాష్ట్రంలో  విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఆర్థిక బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే ప్రభుత్వ కార్యకలాపాలు మొత్తం దీని మీదనే ఉంటుంది కాబట్టి.. వేరేది చేయడం సాధ్యం కాదు.. కాబట్టి దానికి అనుకూలమైన నిర్ణయం తీసుకోండి అంటూ ప్రధాని మోదీకి బాలశౌరి లేఖ రాశారు. అయితే బడ్జెట్ సమావేశాల కోసం ప్రత్యేక ఉత్తర్వులు తీసుకొని చేసుకోవాలి కానీ ఆర్థిక సంవత్సరం ముందుకు జరపడం ఏమిటి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకే రోజులో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం  మీద దృష్టి పెట్టాలి కానీ ఆర్థిక సంవత్సరానికి ముందుకు జరపడం ఎలా కుదురుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: