కరోనా  వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చాలా మంది విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్  పెరిగి పోయింది. అయితే ప్రస్తుతం చాలా మంది తెలుగు ప్రజలు కరోనా  వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 20 కరోనా  పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మొత్తం కరోనా  వైరస్ పేరెత్తితే చాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో కీలక చర్యలు చేపడుతోంది. 

 

 ఇదిలా ఉంటే ఇతర దేశాల్లో ఉన్న చాలామంది తెలంగాణ వాసులు కూడా కరోనా  వైరస్ కారణంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కజకిస్తాన్ లోని చాలా మంది విద్యార్థులు రవాణా వ్యవస్థ మొత్తం  ఆగిపోవటంతో ఇండియా కు రాలేకా...  కజకిస్తాన్ లో ఉండ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను తెలంగాణకు రప్పించడానికి చర్యలు చేపట్టండి అంటూ  తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం కజకిస్తాన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థుల  పోస్ట్ చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. 


 ప్రస్తుతం కజకిస్తాన్ లో ఉండి చేయని తప్పుకు ఇబ్బంది పడుతున్నట్లు గా ఉంది తెలంగాణ విద్యార్థులు. చదువుల కోసం కజకిస్తాన్ కి వెళ్లారు. అయితే కరోనా  వైరస్ గురించి తెలియగానే వెనక్కి రావడానికి నిర్ణయించుకున్నప్పటికీ.... డబ్బు సమకూర్చుకుని వచ్చే సమయానికి  రవాణా సదుపాయాలు  ఆగిపోయాయి. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విదేశాలలో చిక్కుకున్న విద్యార్థులను తెలంగాణ కు రప్పిస్తోంది . అయితే కజకిస్తాన్ లో చిక్కుకున్న చాలామంది విద్యార్థులు కేటీఆర్ కేసిఆర్ సహా తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి లకి  కూడా ఎన్నో రిక్వెస్ట్ లు కూడా పెట్టారు. కేటీఆర్  గారు దయచేసి మమ్మల్ని తెలంగాణకు రప్పించండి అంటూ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: