భారత దేశ వ్యాప్తంగా కరోనా  వైరస్ రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వ్యాధి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ప్రజలు ఎవరు సమూహంగా ఉండకూడదని... చేతులు సబ్బుతో కడుక్కోవాలని.. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అంటూ ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఇక ప్రజలు సమూహాలుగా ఉండకుండా చూసేందుకు.. కఠిన నిబంధనలను కూడా అమలు చేస్తున్నాయి.

 


 ఇప్పటికే విద్యాసంస్థలు, పబ్బులు, కోచింగ్ సెంటర్లు, షాపింగ్ మాల్స్ ఇలా జన సమూహం ఎక్కువగా ఉండే అన్ని ప్రదేశాలను మూసివేస్తూ  సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాలు. మోడీ పిలునిచ్చిన  జనతా కర్ఫ్యూ అనంతరం.. ఏకంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి లు తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్  ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకూ లాక్ డౌన్  కొనసాగనుంది కాబట్టి ముందుగా నిత్యావసర సరుకులు కొనడానికి మరోసారి జన  సమూహం మార్కెట్లో చుట్టుముట్టాయి. ఏదైతే జరగ కూడదు అని తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు  చెప్పారో అదే జరిగి పోయింది. 

 

 ఇదిలా ఉంటే అందరూ ప్రాణభయంతో బెంబేలెత్తుతున్న నేపథ్యంలో.. అందరి అవసరాలను ఆసరాగా చేసుకుంటున్నారు కూరగాయల వ్యాపారులు. మొన్నటివరకు టమాటాలు పది రూపాయలకు రెండు మూడు కిలోలు ఇచ్చి వ్యాపారులు.. ఇప్పుడు టమాటా సహా అన్ని కూరగాయల ధరలు దారుణంగా పెంచేశారు.  కిలో టమోటా వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. కొత్తిమీర పుదీనా కూడా భారీగానే లో పెంచేశారు. ఇలా అన్ని రేట్లు  ఒక్కసారిగా పెంచేసినప్పటికీ ప్రజలు తప్పదు అన్నట్లుగా కొనుగోలు చేశారు. అయితే ఇలాంటివి చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం చెబుతోంది. అడ్డగోలుగా దోచుకుంటున్న  సమయంలో చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు అంతా అయిపోయాక కఠిన చర్యలు తీసుకుంటాము అనడం శోచనీయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: