ప్రపంచానికే అగ్రరాజ్యం.. ప్రపంచ రాజకీయాలను శాసించే దేశం.. ఇప్పుడు కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతోంది. వందల సంఖ్యలో జనం కరోనా ధాటికి రాలిపోతుంటే.. ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయింది. ఉన్నపళంగా పెరుగుతున్న కరోనా కేసులు ఓ వైపు.. పెరుగుతున్న మరణాలు ఓవైపు అమెరికాను భయపెడుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 500కు చేరువైంది. సోమవారం రాత్రి పది గంటల నాటికి 473 మంది కరోనాతో అమెరికాలో మరణించారు.

 

 

మరో దారుణమైన విషయం ఏంటంటే కరోనా కేసుల సంఖ్య జెట్ స్పీడుతో పెరుగుతోంది. 40 వేల మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదయ్యాయి. ఈ సంఖ్య గత మూడు రోజుల క్రితం కేవలం 14 వేలు మాత్రమే ఉండేది. అంటే.. మూడు రోజుల్లో మూడు రెట్లు పెరిగిందిందన్నమాట. మరి కరోనాను అమెరికా కట్టడి చేయలేకపోతే... పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఊహించుకుంటేనే అమెరికన్ల వెన్నులో చలిపుడుతోంది.

 

 

అమెరికాలో 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 100 మందికి పైగా చనిపోయినట్టు ప్రముఖ జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ నివేదిక ఇచ్చింది. అత్యాధునిక వైద్య సేవలు ఉండే అమెరికాలో సైతం ఏకంగా ఒక్కరోజులో 100 మంది మరణించడం అంటే అది మాటలకు అందడం లేదు.

 

 

ఈ పరిస్థితికి చైనాయే కారణమంటూ ట్రంప్ తిడుతున్నా... దీన్ని ఎలా అరికడతారన్నది ఇప్పుడు ఎలా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఓవైపు ఇటలీ, స్పెయిన్, ఇరాన్ అనుభవాలు అమెరికన్లను మరింతగా భయపెడుతున్నాయి. కొత్తగా ఈ ఒక్క రోజే.. 7 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరి చైనాలా అమెరికా కట్టడి చేస్తుందా..లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: