కరోనా గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. వాటిలో వాస్తవాల కంటే అవాస్తవాలే ఎక్కువగా ఉంటున్నాయి. అజ్ఞానంతో ఎన్నో పోస్టులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వాటిలో ఈ కరోనా లక్షణాలను గురించి వార్తలూ ఉన్నాయి.

 

 

అసలు కరోనా వచ్చినట్టు ఎలా గుర్తుపట్టాలి. ఈ జబ్బు లక్షణాలు 14 రోజుల తర్వాత బయటపడతాయి కదా.. అన్న అనుమానం చాల మందిలో ఉంది. అయితే.. కరోనా వైరస్ వ్యాధిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు జ్వరం, నీరసం, పొడి దగ్గు, ఆకలి లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

 

 

కొంత మంది రోగుల్లో తల నొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం, వికారం, నీళ్ళ విరేచనాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో కొంత మందికి ఒకటో, రెండో లక్షణాలే ఉండవచ్చు. కొంత మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవచ్చు. కొంతమందిలో ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలు చాలా మటుకు జలుబు, ఫ్లూ వంటి ఇతర వైరల్ వ్యాధుల్లో కనిపించేవే.

 

 

అందుకని ఇలాంటి లక్షణాల కారణంగా.. చిట్కాల కారణంగా మనం కరోనాను గుర్తుపట్టలేం. అందుకే ఈ చిట్కాలు అనుసరించి కరోనా వచ్చిందని కుంగిపోవద్దు.. కరోనా రాలేదని ధీమాగా ఉండొద్దు. మీకు అంతగా అనుమానం ఉంటే.. కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఆసుపత్రులకు వెళ్లి చెకప్ చేయించుకోండి. అలాంటి పరీక్షల ద్వారా మాత్రేమే కరోనాను నిర్ధారించగలం తప్ప. చిట్కాలతో కాదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అన్నీ పుకార్లు నమ్మి గందరగోళంలో పడకండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: