కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణం లో కొంతమంది చాల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా , ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదం లోకి నెడుతున్నారు . తాజాగా తెలంగాణ జిల్లా భద్రాద్రి , కొత్తగూడెం జిల్లా చోటు చేసుకున్న సంఘటన ను పరిశీలిస్తే కరోనా పాజిటివ్ గా తేలిన బాధితుడు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో ఇట్టే స్పష్టమవుతుంది . స్థానికంగా పోలీసు శాఖలో డిఎస్పీ హోదా లో   విధులు నిర్వహిస్తున్నఓ వ్యక్తి కుమారుడు ఇంగ్లాండ్ లో చదువుకుంటున్నాడు .

 

సదరు యువకుడు ఈ నెల 18 న లండన్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నాడు . అక్కడి నుంచి కారు లో స్వగ్రామానికి బయల్దేరాడు . 20  న సదరు యువకుడు జలుబు, దగ్గు లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా , అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది . లండన్ నుండి ఆ యువకుడు రాష్ట్రం లో అడుగుపెట్టేసరికే ...  కరోనా తీవ్రత పై అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ,ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది . అయితే పోలీసు శాఖ లో ఉన్నత స్థాయి లో  విధులు నిర్వహిస్తున్న సదరు డిఎస్పీ స్థాయి అధికారి తన కుమారుడి కి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయో , లేదో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం అతని బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది .

 

 ఇక సదరు యువకుడు కూడా సొంతంగా క్వారంటైన్ పాటించకుండా బంధు , మిత్రులను , కుటుంబ సభ్యులను కలవడం ద్వారా వారందర్ని ప్రమాదం లోకి నెట్టాడు . ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు పలువురు ఇదే తరహాలో వ్యవహరిస్తూ , ఇతరులకు కరోనా వ్యాధి సోకేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ , తమ బాధ్యతారాహిత్యాన్ని చాటుకుంటున్నారు . వారి బాధ్యతారాహిత్యం కారణంగా చుట్టూ పక్కలవారు ఇబ్బందుల్లో పడుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: