అన్ని దేశాల  ప్రజలను వణికిస్తున్న అతి భయంకరమైన సమస్య కరోనా వైరస్.  భారతదేశంలో లేటుగా వచ్చినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న సందర్భం చూస్తున్నాం. దీనిని నివారించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం మీదనే కాకుండా ప్రజల మీద కూడా ఉందని ప్ర‌తి భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇస్తున్న సూచనలు తూచ తప్పకుండా పాటించాలని కోరుతున్న. 
పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్మెంట్లలో, గ్రామాలలో  అందరికీ అందరూ ఈ కరోనా వైరస్ నివారించడంలో తీసుకోవాల్సిన చర్యలు పాటించాల్సిన పద్ధతులు పాటించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్  పెట్టి రేపు దేశ వ్యాప్తంగా స్వచ్చదంగా బయటికి రాకుండా ఉండాలని కోరారు,  గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రేపు ఉదయం నుండి ఎల్లుండి పొద్దున వరకు బందుకు పిలుపు ఇవ్వడం జరిగిందో అది తూచా తప్పకుండా పాటించాలని ప్రజలంద రినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.   ఈ వైరస్ ను నివారించడానికి ఏకైక మార్గం వైరస్ వచ్చిన వారితో కలవకుండా ఉండటమే,  అప్పుడే తెలంగాణ రక్షించబడుతుంది అని ఆయ‌న తెలిపారు. 

 

ఇక ఇదిలా ఉంటే...తెలంగాణ ప్రజలందరూ వచ్చే 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండి వైరస్ సోకిన వారితో కలవకుండా ఉండాలి అనే  నియమాన్ని పాటించాలి అలా చేస్తే ఈ వైరస్ను పారద్రోల వచ్చును. కొన్ని దేశాల్లో అయితే ఈ వ్యాధి సోకి చ‌నిపోతే... ఒక పేషెంట్ చనిపోతే  ఈ పైన ఉన్న ఫొటొలో చూపించినట్లుగా బాగ్ లో చుట్టి  ప్లాస్టిక్ బాక్స్ లో సీల్ వేస్తారు కనీసం బాడీ ని ఇంటికి కూడా పంపించరు కాలిన తర్వాత బూడిద  కూడా ఇస్తారో ఇవ్వరో  తెలియని పరిస్థితి ఇది ఒక భయంకరమైన  వీడ్కోలు...ఇంతలా  ఆ మహమ్మారి  విజృంభించకూడదని కేంద్ర  రాష్ట్ర  ప్రభుత్వాలు లాక్ అవుట్ ప్రకటిస్తే కనీసం పట్టించుకోకుండా  రోడ్ల పై తిరుగుతున్న  మిమ్మల్నెమనాలి అని ప్ర‌భుత్వాలు ప్ర‌శ్నిస్తున్నాయి. 

 

ఒక వారానికి సరిపడా  సరుకులు  లేవా మీ మీ ఇళ్లల్లో... ఒక వారం ఇంట్లో ఉండలేరా  పెళ్ళాం పిల్లలతో ... దేశ భవిష్యత్ ఆలోచించిన  పెద్దలే  స్వయం  నిర్బంధం చేసుకుంటుంటే  నీకేమైంది ... అంటూ ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. మాములు జబ్బైతే  నువ్వొక్కడివే  పోతావ్  ఇది గాలితో కలిసి నిన్నూ నీ కుటుంబాన్ని ఈ సమాజాన్ని  కూడా నాశనం చేయగలిగే శక్తివంతమైన వైరస్ అని ఇంకెప్పుడు తెలుసుకుంటావ్ ...అంటూ కొంత మంది పెద్ద‌లు మీడియా ముఖంగా ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. రెండవ దశ లో ఉంది కాబట్టే ఇలా అయినా కంట్రోల్ చేయగలవు నీ వంతుగా..స్టేజి దాటిందో  పర్యవసానాన్ని  ఊహించలేవు కూడా గుర్తు పెట్టుకుని ఇప్పటికైనా కళ్ళు తెరుచి జాగ్ర‌త్త‌లు వ‌హిస్తే మంచిద‌ని వైద్యులు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: