కరోనా వల్ల ప్రభావితం కానీ రంగం అంటూ ఏది లేదు . అన్ని రంగాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది . కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటే , కూర గాయాలు , నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి . ఇప్పటికే కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకింత పెరుగుతుంటే , మృతుల సంఖ్య రెండు అంకెలకు చేరుకుంది .  కరోనా కట్టడి కి ప్రభుత్వాలు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే ,  ప్రజలు మాత్రం చాల బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి .

 

ఆదివారం జనతా కర్ఫ్యూ ను సక్సెస్ చేసిన తెలంగాణ  ప్రజలు ,  లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యం లో  సోమవారం అదే స్ఫూర్తిని ప్రదర్శించలేకపోయారు .  లాక్ డౌన్ నిబంధాలేవీ తమకు కాదన్నట్లు  నిర్లక్ష్యంగా వ్యవహరించి విమర్శలను ఎదుర్కొంటున్నారు . ఒకవైపు కరోనా వ్యాధిని కట్టడికి స్వీయ నియంత్రణ అవసరమని , ఇల్లు కదలవద్దని ప్రభుత్వ పెద్దలు , నిపుణులు చెబుతుంటే హైదరాబాద్ నగర వాసులు మాత్రం యధావిధిగా తమ  రోజువారీ పనుల్లో తలమునకలయ్యేందుకు రోడ్డెక్కారు . దీనితో చాల  చోట్ల పోలీసులు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపగా, సైబర్ టవర్స్ తదితర ప్రాంతాల్లో వాహనాలను సీజ్ చేశారు .

 

ఇక పై ద్విచక్ర వాహనం పై అత్యవసరమైతే ఒక్కరే వెళ్లాలని , కారు లో ఇద్దరికి మాత్రమే అనుమతించనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు . ఇక పై లాక్ డౌన్ నిబంధనలను చాల కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు . ప్రజలు కరోనా వ్యాధి విస్తృతిని  అరికట్టేందుకు ఇంటికి పరిమితమయి సహరించాలని కోరారు . అలాకాని పక్షం లో అరెస్టులు తప్పవంటూ హెచ్చరికలు చేశారు . సాయంత్రం ఏడు దాటిందంటే అత్యవసర సేవలు అవసరం ఉన్న వారు తప్ప  ఎవరు రోడ్డుపైన కన్పించవద్దని అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: