ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట మారు మోగిపోతుంది.. అదే కరోనా.. ప్రజలకు కంటి మీద నిద్ర కూడా లేకుండా చేస్తుంది అన్న సంగతి తెలిసిందే..చైనా నుంచి వచ్చిన కరోనా మహమ్మారి ఇక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ వస్తుంది..అందుకే ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఉద్దేశ్యంతో  కేంద్ర ప్రభుత్వం మోదీ తీసుకొచ్చిన జనతా కర్ఫ్యూ సడలింపు ను తీసుకొచ్చారు.. ఈ మేరకు ఈ కర్ఫ్యూ కు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.. 

 

 

కరోనా మహ్మమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు విశేష స్పందన కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. ఒక్క అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి... రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.. 

 

 

 

తాజాగా కోల్‌కతాలోని దమ్ దమ్ జైలు ఖైదీలు కరోనాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కరోనా పెరిగితే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తూ జైల్లో ఖైదీలు ధర్నాకు దిగడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఖైదీలు జైలు గోడలకు నిప్పుపెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో అధికారులు మూడు ఫైరింజన్లను తెప్పించి మరీ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా ఖైదీలు శాంతించకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.

 

 

కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్న కారణంగా జైలులో ఉన్న ఖైదీలను కుటుంబ సభ్యులు కలిసే అవకాశాన్ని జైలు అధికారులు రద్దు చేశారు. తమ కుటుంబ సభ్యులను కలవకుండా చేయడం వారి ఆగ్రహానికి కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 31 వరకు కుటుంబ సభ్యులతో కలవకుండా ఆదేశాలు జారీ చేయడం.. అలాగే ఇప్పటికే జైల్లో పదేళ్ల శిక్ష పూర్తి చేసిన వారికి 15 రోజుల పాటు పెరోల్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో ఖైదీలు రెచ్చిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. భారీగా జరిగిన ఈ సంఘటన లో పలువురు ఖైదీలకు తీవ్ర గాయాలు కూడా తగిలాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: