చైనా లోని వ్యూహాన్ నగర సరిహద్దుల్లో బయట పడిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. అమెరికా, భారతదేశం సహా అన్ని దేశాలలోను కరోనా ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పటికే లక్షల్లో కరోనా సోకి మరణించగా మిగతా దేశాలలోను నిత్యం పదుల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ కరోనా ఒక్క ఇటలీలోనే రోజుకి 600-700 మంది కరోనా వైరస్ సోకి మరణిస్తున్నారు. ఇక్కడ నిత్యం ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ కరోనాకి మందు గాని, వ్యాక్సిన్స్ గాని ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే నివారణ ఒక్కటే మార్గం. అందుకే  అన్ని దేశాల ప్రజలు ఎక్కడి వారు అక్కడే స్వీయ నిర్భందం చేసుకుంటున్నారు. 

 

అయితే సాధారణంగా చాలామందికి ఇంకా కరోనా అంటే ఏంటి .. ఈ వైరస్ ఎలా వస్తుంది అన్న దానిమీద పూర్తిగా అవగాహన రాలేదు. అందుకే అధికారులు, ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రి ఇంత కట్టడి చేస్తున్నప్పటికి కొంతమంది మాత్రం చాలా అజాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. మాకు కరోనా లేదు కదా మేము ఎక్కడైనా తిరగొచ్చు ఏమైనా చేయొచ్చు అనుకుంటూ విచ్చల విడిగా బయటకి వచ్చి స్నేహితులతోను, బంధువులతోను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కరోనా వైరస్ ఎలా విస్తరిస్తుందో తెలీకపోవడమే ఇందుకు కారణం. అదీ కాక కరోనా సోకిన వ్యక్తి 14 రోజుల పాటు అతి సాధారణంగా ప్రతీ రోజు ఉన్నట్టుగానే హుషారుగా ఉంటాడు. కరోనా బారిన పడ్డాడనిపించినా అసలు నమ్మరు.

 

ఒక వ్యక్తిలో కరోనా సోకినప్పటికి మొదటి వారం రోజులు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించవు. దాంతో అతను అందరితోను కలవడం ముట్టుకోవడం చేస్తాడు. అంతేకాదు అతను రోజువారి చేసే పనులన్నిటిని చేసుకుంటూ ఉంటాడు. కానీ అలా చేస్తున్నప్పుడే ఆయన ముట్టుకున్న ఆ పరికరాలకి, అతను కలిసిన వ్యక్తులకు కరోనా వైరస్ వ్యాపించడం మొదలవుతుంది. ఇక రెండవారం లో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. కాని ఇవి కరోనా లక్షణాలు అని తెలుసుకునే లోపే 14 రోజులు గడిచిపోతాయి. అసలు కథ అప్పుడు మొదలవుతుంది. 14 రోజుల వరకు అందరిలో తిరుగుతూ చలాకిగా కనిపించిన వ్యక్తికి వ్యాధి తీవ్రమవుతుంది. 

 

అంతే ఇక ప్రాణాలను కాపాడుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అప్పటికే ఈ వ్యాధి ఊపితిత్తుల్లోకి చేరి శరీరమంతా పాకేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా కరోనాని జయించడం ఎవరి తరం కాదు. అయితే ఈ 14 రోజుల్లో అతను కనీసం 6 - 10 మంది కి అంటించే అవకాశం గరిష్టంగా ఉంటుంది. ఈ 10 మరో 100 మందికి. ఇలా స్టాటటికల్ గా చూస్తే వందల్లో వేలల్లో మరణాలు సంభవిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: