ఇన్నాళ్లూ కనీసం మనుషులం అని మరచిపోయి బ్రతికాం.. కనీసం ఇప్పుడైనా గుర్తుకు తెచ్చుకుని బాధ్యతగా ప్రవర్తించుదాం అని ఆలోచించవలసిన సమయం వచ్చింది.. అధికారులు చెప్పినట్లుగా వింటే ప్రాణాలతో బయటపడుతాం.. లేదంటే ఏ హస్పిటల్లోనో ఉంటాం.. ఇంకా వినకుండా మొండిగా ప్రవర్తిస్తే గోడమీదికి ఎక్కుతాం.. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎలా బ్రతకాలో నిర్ణయం ఎవరికి వారి చేతుల్లోనే ఉంది.. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగం తేలికగా తీసుకునేటంతటి పదం కాదు.. మనిషిని బ్రతికుండగానే కళ్లముందే నిర్జీవిగా మార్చి, జీవం తీసుంటున్నా ఏం చేయలేని దుస్దితి కల్పిస్తుంది..

 

 

అందుకే చిన్నవారికి పెద్దవారికి అందరికి ఒకటే విన్నపం.. అందరం బ్రతుకుదాం.. అందర్ని బ్రతికిద్దాం.. మనకు వీలున్నంతలో.. ఇకపోతే ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో కొందరు దళారులు నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి దోచుకుంటున్నారు.. ఇంకా దోచుకోవడానికి సిద్దపడుతున్నారు.. ఇంత ఆశ మనిషికి ఎందుకు.. ఆ డబ్బులతోనే సంసారాలు చేయరుకదా.. ఇలా దోచుకున్న పైసలతో ఎన్నాళ్లూ సుఖపడతారు.. ఒక్క సారి ఆలోచించండి.. ఎదువారి కన్నీటితో వచ్చే కాసులతో ఎంతకాలం సంతోషంగా ఉంటారో.. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితుల దృష్ట్యా ఎవరైన వ్యాపారులు లాక్‌డౌన్‌ సాకుతో ధరలు పెంచితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని, జైలుకు పంపుతామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. రేట్లు పెంచి అమ్మితే వెంటనే 040- 23447770 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని చీఫ్‌ రేషనింగ్‌ అధికారి బాల మాయాదేవి తెలిపారు.

 

 

ఇలా వచ్చే ఫిర్యాదులకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లతో పాటుగా.. నిత్యావరస సరకుల ధరలు పెంచి అమ్మరాదని హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి ఆదేశాలు లెక్కచేయకుండా ప్రవర్తిస్తే మాత్రం చట్టరిత్యా చర్యలు చేపడతామని, కావున ప్రజలు కూడా ఎక్కువ ధర పెట్టి వస్తువులు కొనవద్దని చీఫ్‌ రేషనింగ్‌ అధికారి బాల మాయాదేవి పేర్కొన్నారు. ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని.. అలా చేస్తేనే మిగతా వ్యాపారులకు భయం ఉంటుందని పేర్కొన్నారు. టోకు, చిల్లర వర్తకులకు ఇప్పటికే పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: