తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రజానీకం మొత్తం భయాందోళనకు గురి అవుతుంది. ఈ వైరస్ కు  సరైన విరుగుడు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు మొత్తం మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇక అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై పోయి ఎన్నో కఠిన నిబంధనలను అమలులోకి తెస్తోంది. ఇక ఇప్పటికే కరోనా  వైరస్ పై  పోరాటానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధం కావాలని  ముఖ్యమంత్రి కేసిఆర్ సూచించిన విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కాగా ప్రస్తుతం వారి నుంచి తెలంగాణ వాసులకు కూడా సోకుతుండటం తో తెలంగాణ లో  మూడవ దశకు చేరుకుంది కరోనా వైరస్.

 

 

 ఇలాగే ప్రజలు నిర్లక్ష్యం చేస్తే ఈ వైరస్ నాలుగవ దశకు చేరుకుంటే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇటలీ ఇరాన్ లాంటి దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్ మార్చి 31 వరకూ రాష్ట్రంలో లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజలు ఎవరూ ఇల్లు దాటి బయటకు రాకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ చాలా మంది ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయడం లేదు.. ఇష్టారీతిన రోడ్ల మీదికి వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు మాత్రం సహకరించడం లేదు. 

 

 

 ఇక దీనిపై స్పందించిన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రజల అందరి సహకారం అవసరం అంటూ తెలిపారు. కరోనా  వైరస్ అనేది కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని రాష్ట్ర ప్రజలందరి సమస్య అంటూ  ఈటల రాజేందర్ తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్  పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. రానున్న పది రోజులు ఎంతో సంక్లిష్టమైనవి  అంటూ తెలిపిన ఈటల రాజేందర్... ప్రాణం ముఖ్యమా కేవలం పది రోజుల పని ముఖ్యమా అన్నది ప్రజలు తేల్చుకోవాలని తెలిపారు. అయితే నగరం నుంచి ఊర్లకు వెళ్లేవారికి వెసులుబాటు కల్పిస్తాము  అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: