కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రాణాలను విడుస్తున్నారు. ఎంతోమంది ఈ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు ఈ కరోనా వైరస్ పెరిగిపోతూనే ఉంది. ఇంకా ఈ కరోనా వైరస్ ను ఎలా కట్టడి చెయ్యాలో ఎవరి తెలియడం లేదు. 

 

అందుకే ఎక్కడ ప్రజలు అక్కడే ఉండాలి అని.. ఇంటి నుండి ఎవరు బయటకు రాకూడదు అని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ గురించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. ఆ వార్త వింటే మీరు కూడా షాక్ అయిపోతారు. అలాంటి వార్త అది.. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఏవి కనిపించకపోయినప్పటికీ కరోనా పరీక్షలు చేస్తే వైరస్ వస్తుంది తాజా లెక్కలు చెప్తున్నాయి. ఐస్‌ల్యాండ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ నిజం బయటపడింది. అసలు ఎలాంటి లక్షణాలు లేకపోతే కరోనా వైరస్ పరీక్షలు ఎందుకు చేశారు ? అంత అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? 

 

అక్కడికే వస్తున్న.. ఐస్‌ల్యాండ్‌లో కేవలం నాలుగు లక్షల జనాభా మాత్రమే ఉన్నారు.. దీంతో అక్కడి ప్రభుత్వం కేవలం కరోనా వైరస్ ఉన్నవారినే కాకుండా దేశంలో ఉన్న 4 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు.. దీంతో కరోనా వైరస్ అక్కడ ఎలాంటి లక్షణాలు లేని వారికీ కూడా వచ్చింది అని తేలింది. 

 

దీంతో చైనా డేటాను పరిశీలించడంతో అక్కడ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో మూడో వంతు మందికి ఎటువంటి లక్షణాలు కనపడలేదని తెలుస్తోంది. అంటే దీని ప్రకారం.. కరోనా సోకినా వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ వారికీ వైరస్ ఉంది అని.. వారు నిశబ్దంగా వైరస్ ను వ్యాప్తి చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి కేసులు చాలా అరుదని చైనా-డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: